ఓ ఇరవై రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. ఎందుకంటే సమ్మర్ లో పెద్ద ఎత్తున కరెంట్ కోతలు ఉంటాయి. అందుకే రెడీ కండి అంటూ మూడు నెలల కిందట..తన పార్టీ నేతలను జగన్ రెడ్డి తొందర పెట్టారు. నిజానికి సరైన సమయానికే ఎన్నికలు వస్తే…కరెంట్ కోతలు ఆర్థిక కష్టాలతో కిందా మీదా పడేది ఏపీ సర్కార్. ఆర్బీఐ నుంచి నెలకు పది వేల కోట్లు అప్పు తీసుకు వస్తున్నా సరిపోవడం లేదు. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేస్తే కోడ్ పేరుతో కొన్ని నిధులు ఎగ్గొట్టవచ్చని అనుకుంటున్నారు.
కానీ ఇప్పుడు కోడ్ వచ్చే పరిస్థితి లేదు. మార్చి పదో తేదీ తర్వాతనే ఎన్ని కల షెడ్యూల్ వస్తుంది. ఇప్పటికే కరెంట్ సమస్యలు ప్రారంభమయ్యాయి. ఏపీలో పలు చోట్ల కరెంట్ కోతలు విధిస్తున్నారు. వచ్చే నెలలో ఎన్నికలషెడ్యూల్ వస్తే… ఏప్రిల్ మధ్యలో పోలింగ్ జరుగుతుంది. అంటే ఆ సమయానికి కరెంట్ కోతలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. ఇక నొక్కాల్సిన బటన్లు ఇతర బిల్లులు పెండింగ్ లో ఉంటాయి. అనేక పథకాలకు బటన్లు నొక్కలేదు. మిచౌంగ్ తుపాను బాధిత రైతులకు రూపాయి ఇవ్వలేదు.
ఇప్పుడు వచ్చే నెల జీతాలు.. పెన్షన్లు కూడా ఇస్తారా లేదా అన్నది సమస్యగా మారింది. అర్జంట్ గా ప్రధాని అపాయింట్ మెంట్ ను జగన్ రెడ్డి కోరుతున్నారు. ఈ ఒక్క నెల పది వేల కోట్లు అప్పు ఇప్పించాలని ఆయన కోరే అవకాశం ఉంది. ఇటీవల ఆయన పర్యటించి వచ్చిన తరవాత ఎడెనిమిది వేల కోట్లు అప్పు ఆర్బీఐ ఇచ్చింది. నిజానికి కేరళ సర్కార్ కు.. ఏడాది మొత్తం కలిసి ఇరవై వేల కోట్లు కూడా అప్పు ఇవ్వలేదు ఆర్బీఐ. కానీ ఏపీకి మాత్రం 70వేల కోట్లు ఇచ్చారు. బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు తీసుకునేలా వెసులుబాటు కల్పించారు.
ఎన్నికలు ముందే వస్తే ఎలాగోలా ఓ నెల ఎగ్గొట్టవచ్చని అనుకున్నారు… ఆ ప రిస్థితి లేకపోవడంతో కొత్త అప్పుల కోసం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.