తెలుగులో రానున్న మోస్ట్ అవెయిటెడ్ చిత్రాల్లో అల్లు అర్జున్ ‘పుష్ప ది రూల్’ ఒకటి. ‘పుష్ప ది రైజ్’కు కొనసాగింపుగా రానున్న దీని కోసం సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పనులు జోరుగా సాగుతున్నాయి. పుష్ప లో ‘ఊ..అంటావా మామ’ ఐటెం సాంగ్ ఓ ఊపు ఊపింది. ఇప్పుడు రెండో భాగంలో కూడా అలాంటి ఓ క్యాచి ఐటెం నెంబర్ వుంది. ఇందుకోసం బాలీవుడ్ నటి నోరా ఫతేహిని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పాట కంపోజింగ్ పూర్తయింది. దేవిశ్రీ ట్యూన్, చంద్రబోస్ లిరిక్స్ బాగా కుదిరాయని తెలుస్తుంది. ‘ఊ..అంటావా మామ’ పాట దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఇప్పుడు చేయబోయే ఐటెం సాంగ్ కూడా పాన్ ఇండియాని ద్రుష్టిలో పెట్టుకొని క్రియేట్ చేస్తున్నారు. డ్యాన్స్ కొరియోగ్రఫీలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డ్యాన్స్ లో వైరల్ మూమెంట్స్ వుండేలో ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే పాటని చిత్రీకరించనున్నారు.