టీడీపీ, జనసేనతో కలిసి నడవడానికి బీజేపీని ఒప్పించింది తానేనని పవన్ కల్యాణ్ ప్రకటించారు. టిడిపి, జనసేన కూటమికి బీజేపీ ఆశీస్సులుండాలన్నారు. పొత్తు ప్రతిపాదనను ఒప్పించడానికి ఎంత నలిగిపోయానో తనకు తెలుసని భీమవరంలో పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో పవన్ వ్యాఖ్యానించారు. కూటమి కోసం జాతీయ నాయకుల దగ్గర ఎన్ని చీవాట్లు తిన్నానో మీకు తెలియదు.. నేను జనసేన పార్టీ ప్రయోజనాల కోసం నేను ప్రయత్నించలేదన్నారు.
కూటమి బలంగా నిలబడాలన్నదే తన కోరికన్నారు. మనలో మనకు ఇబ్బందులున్నాయి, మన పార్టీ నేతలు త్యాగాలు చేయా.. త్యాగం చేసిన ప్రతీ ఒక్కరికీ గుర్తింపు ఇస్తామన్నారు. లమీరంతా టిడిపికి ఓటేస్తే.. ఓటు బదిలీ అయితే అదే మీకు ప్రాతిపదిక అవుతుంది. దాన్ని బట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో మిమ్మల్ని గుర్తిస్తామని హమీ ఇచ్చారు. నాయకులు అందరినీ నమ్మలేం..మేము ఉన్నాం అని రెండు చోట్లా పోటిచేయించి నన్ను ఓడించి ఇప్పుడు పారిపోయారని కొంత మంది నేతల గురించి చెప్పారు. ఓట్ల కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిందేనని కనీసం భోజనాలకైనా పెట్టుకోపోతే ఎలా అని పవన్ ప్రశ్నించారు డబ్బులు లేకుండా రాజకీయాలు చేయాలని ఎవరికీ చెప్పలేదు..ఎన్నికల సంఘం అభ్యర్థి ఖర్చును 45 లక్షలకు పెంచిందని గుర్తు చేశాు. రానున్న ఎన్నికల్లో ప్రజలు జగన్కు బుద్ధి చెప్పడం తథ్యం. అణగారిన కులాలు అభివృద్ధి సాధించాలంటే, దాని అర్ధం ఇతర కులాలను తొక్కేయడం కాదు.
అన్ని కులాలను సాధికారత దిశగా తీసుకువెళ్ళడం చాలా అవసరమన్నారు. రాజకీయాల్లో కూడా కొత్తతరం వారికి అవకాశం ఇవ్వాలన్నారు. జనసేన కొత్త తరం నాయకులకు అవకాశం ఇస్తుంది. దళితుడిని చంపిన వ్యక్తి జైలు నుంచి వస్తే పది వేల మందితో ఊరేగించారు. చంపింది ఒకరైతే మరో కులాన్ని వివాదంలోకి లాగారు. బంధుత్వం వేరు, రాజకీయం వేరు. మా అన్నయ్య చిరంజీవితో కొన్ని అంశాల్లో విబేధించి బయటకు వచ్చాను. మనుషులను జగన్ విడగొట్టారు. ఈ సంస్కృతి కుటుంబాలకు పాకింది. మాజీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సంపాదించిన ఆస్తుల్లో వాటాను చెల్లి షర్మిలకు జగన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. అలాంటి వ్యక్తి ప్రజలకు ఏం మంచి చేస్తారు అని పవన్ ప్రశ్నించారు.