ఏపీలో కాంగ్రెస్ పార్టీ పదేళ్లుగా నిద్రాణంగా ఉంది. ఆ పార్టీ ఏదైనా ఆందోళనకు పిలుపునిచ్చిన సందర్భాలు దాదాపుగా లేవు. ఉన్నా ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే.. ఆ పార్టీకి లీడర్,క్యాడర్ ఎవరూ లేరు. ఉన్నా.. గట్టి నాయకత్వం లేకపోవడంతో ఎవరూ తెరపైకి వచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నేతల్ని హౌస్ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. కాంగ్రెస్ పార్టీకి కూడా భయపడే పరిస్థితిని ప్రభుత్వానికి తీసుకు వచ్చారు. ఈ ఘనత నిస్సందేహంగా షర్మిలదే.
మెగా డీఎస్సీ పేరుతో జగన్ రెడ్డి యువతను మోసం చేశారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం మూడు సార్లు డీఎస్సీ వేసినా అరకొర పోస్టులతో ఇచ్చారని అబద్దాలు ఆడుతూ తాము రాగానే మెగా డీఎస్సీ వేస్తామని యువతను ఊహించారు. ఐదేళ్ల పాటు ఎలాంటి డీఎస్సీ ఇవ్వకపోగా ఎన్నికలకు ముందు అరకొర పోస్టులతో తప్పుడు నిబంధనలతో… డీఎస్సీ వేశారు. అది కూడా కోర్టు కేసుల్లో పడింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు రూల్స్ తో డీఎస్సీ ఇచ్చి… ఆ నోటిఫికేషన్ పనికి రాకుండా చేశారన్న వాదన వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో మెగా డీఎస్సీ కోసం కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని ప్రకటించింది. మంత్రుల ఇళ్లను ముట్టడించిన ఎన్ఎస్యూఐ కార్యకర్తలు ఇప్పుడు సెక్రటేరియట్ ముట్టడికి సిద్ధమయ్యారు.
స్వయంగా షర్మిల సెక్రటేరియట్ ముట్టడికి పిలుపునిచ్చారు. కుమారుడి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ.. ఆమె ముట్టడికి రెడీ అయ్యారు. అయితే షర్మిలతో పాటు కాంగ్రెస్ నేతల్ని హౌస్ అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే షర్మిల పార్టీ ఆఫీసుకు చేరుకుని పార్టీ ఆఫీసులోనే రెస్ట్ తీసుకున్నారు. అక్కడ్నుంచే సెక్రటేరియట్ ముట్టడికి వెళ్లనున్నారు. ఎలాగైనా ముట్టడి నిర్వహించి తీరాలన్న పట్టుదలతో షర్మిల ఉన్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీని నియంత్రించడానికి కూడా వందల మంది పోలీసుల్ని ఉపయోగించాల్సి వస్తోంది. వైసీపీ దిగజారిపోయిన పరిస్థితి ఇదే సాక్ష్యంగా కనిపిస్తోంది.
విజయవాడలో కాంగ్రెస్ ఆఫీస్ వద్ద వందల మంది పోలీసులు
మస్తాన్ వలీ, రుద్రరాజు అరెస్ట్
షర్మిలను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం
మెగా డీఎస్సీ కోసం సెక్రటేరియట్ ముట్టడికి షర్మిల పిలుపు#APCongress #Sharmila pic.twitter.com/xZCSqKVyMS
— Telugu360 (@Telugu360) February 22, 2024