యూ ట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్, నటుడు షణ్ముఖ్ చిక్కుల్లో పడ్డాడు. గంజాయితో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అది కూడా యాక్సిడెంటల్‌గా జరిగిపోయింది. ఓ కేసు విచారణలో నిమిత్తంగా హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు షణ్ముఖ్ నివాసానికి వెళ్లారు. వాళ్లు వెళ్లే సమయానికి షణ్ముఖ్ గంజాయి సేవిస్తూ కనిపించాడు. దాంతో నార్సింగ్ పోలీసులు షణ్ముఖ్‌ని అదుపులోకి తీసుకొన్నారు.
షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ తనని ప్రేమ పేరుతో మోసం చేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పదేళ్ల పాటు ఇద్దరం ప్రేమలో ఉన్నామని, పెళ్లి చేసుకొంటానని సంపత్ నమ్మించాడని, నిశ్చితార్థం కూడా జరిగిందని, అయితే ఆ తరవాత సడన్ గా మరో అమ్మాయిని పెళ్లి చేసుకొన్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. సంపత్ వినయ్, షణ్ముఖ్ ఇద్దరూ కలిసే ఉంటున్నారు. దాంతో సంపత్ కోసం.. వేళ్తే అక్కడ షణ్ముఖ్ దొరికాడు. విచారణ సమయంలో షణ్ముఖ్ దురుసుగా ప్రవర్తించాడని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సివుంది.