సీఎం జగన్ రెడ్డి ఎన్నికల ప్రచార ఖర్చులను ప్రజా సొమ్ము నుంచి దిగమింగాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా.. ఇంటలిజెన్స్ డీజీ.. జీహుజూర్ ఐపీఎస్ సీతారామారామాంజనేయులు నుంచి ఓ సిఫారసు చేయించుకున్నారు. సీఎం సెక్యూరిటీకీ రెండు హెలికాఫ్టర్లు అవసరమని.. ఒకటి విజయవాడలో ఇంకో విశాఖలో ఉండాలని సిఫారసు చేశారు. సీఎం సెక్యూరిటీకీ హెలికాఫ్టర్లకు ఎంటి సంబంధం సామాన్యుడికి డౌట్ వస్తే… ఎక్స్ పర్ట్స్ తో ఎందుకు అవసరమో చెప్పిస్తారు. అలాంటి వాటిలో మొదటి కారణం.. ఏపీ అన్ని అరాచక శక్తులకు అడ్డాగా మారిపోయిందట.
ఏపీలో అన్ని ఉగ్రవాద, నక్సలిజం గ్రూపులు ఉన్నాయా ?
ఏపీలో ఉగ్రవాద ముఠాలు ఉన్నాయా ?. ఎప్పుడైనా చిన్న దాడి జరిగిందా ? కర్నూలులో ఓ మత సంస్థకు చెందిన వారిని ఉగ్రవాద ముఠాల సభ్యులుగా అనుమానించి అరెస్టు చేసి తీసుకుపోయారు.. వారు వైసీపీ సానుభూతిపరులుగా తేల్చారు. వారెప్పుడూ కుట్రలు చేసినట్లుగా ఏపీ పోలీసులు గుర్తించలేదు అసలు ఏపీలో ఉగ్రవాద కదలికలే లేవని డీజీపీ కేంద్రానికి నివేదికలు ఇచ్చారు. ఏపీ నక్సలైట్ల కేంద్రంగా మారిందా ?.. అంటే హెలికాఫ్టర్ల కోసం మారిందనే డీజీ చెబుతున్నారు. నక్సలైట్ల నుంచి జగన్ రెడ్డికి ముప్పు ఉందట. హెలికాఫ్టర్లు అద్దెకు తీసుకుని రెండు విమానాశ్రయాల్లో పెడితే… ముప్పు తగ్గుతుందట.
ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరి నుంచి జగన్ రెడ్డికి ముప్పే !
ఇంటలిజెన్స్ డీజీకీ ఎంత కామన్ సెన్స్ లేదో.. ఆయన చేసిన సిఫారసులు చూస్తే అర్థమవుతుంది.. పోలీసు శాఖ ఎన్నికల రకాల నేరస్తులు ఉంటారనుకుంటే.. అన్ని రాకల నేరస్తుల నుంచి సీఎం జగన్ కు ముప్పు ఉంటుందట. అందుకే హెలికాప్టర్లు కావాలట. ఇప్పటికే ఎస్ఎస్జీ పేరుతో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేసుకున్నారు. అది సరిపోక హెలికాప్టర్లు. ఇంటలిజెన్స్ నివేదికను అడ్డంగా పెట్టుకుని హెలికాఫ్టర్లు బుక్ చేసుకోవడానికి ఏపీలో అన్ని రకాల ఉగ్రవాద, టెర్రరిస్టుల కదలికలు ఉన్నాయని ముద్ర వేసేశారు.
జనం డబ్బుతో హెలికాఫ్టర్ల కోసం ఎన్నెన్ని నాటకాలో !
ప్రజాధనాన్ని ఫలహారంలా మేసే ఏ ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రంలో ఉండడు. తన ప్రైవేటు ఇంటికి వందలకోట్లు పెట్టి సిగ్గు లేకుండా మరమ్మతులు చేయించుకున్నారు. ప్రజా ఆస్తి అయిన ప్రజాభవన్ ను.. అన్ని అనుమతులు ఉన్నా కూలగొట్టారు.. అన్ని రకాల నిబంధనలు ఉల్లంఘించి.. రుషికొండపై ఐదు వందల కోట్ల ప్రజాధనం పెట్టి ఇల్లు కట్టారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. వందల కోట్లు జగన్ రెడ్డి మెయిన్టనెన్స్కే సరిపోతున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల పేరుతో ఆయన పెట్టే ప్రతీ సభ ఎన్నికల ప్రచారసభే. ఆ ఖర్చంతా ప్రజలదే. ఇప్పుడు కోడ్ వచ్చిన తర్వాత కూడా ప్రజల సొమ్ముతోనే ప్రచారం చేయడానికి హెలికాఫ్టర్లు రెడీ చేసుకున్నారు.