తెలంగాణలో మరో రెండు గ్యారెంటీల అమలుకు తేదీ ఖరారు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నెల 27 నుంచి ఉచిత కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రియాంక గాంధీ చేతులు మీదుగా ప్రారంభించనున్నారు. ఈ రెండు గ్యారెంటీలు ప్రారంభానికి ముఖ్య అతిధిగా హాజరవుతున్న కాంగ్రేస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ హాజరవుతారు.
ఎన్నికల షడ్యూల్ మరో రెండు వారాల్లో రానుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో సగం మందికిపైగా ఓటర్లను ప్రభావితం చేసేలా.. ఐదు వందలకే గ్యాస్ సిలిండర్.. రెండు వందల యూనిట్ల వరకూ కరెంట్ ఫ్రీ పథకాలను ప్రారంభిస్తున్నారు. మార్చి మొదటివారం నుంచి జారీచేసే విద్యుత్ బిల్లులకు సంబంధించి.. 200యూనిట్లలోపు వాడే అర్హులైన వినియోగదారులకు జీరో బిల్లులు ఇవ్వాలని అధికారులను ఇప్పటికే సీఎం ఆదేశించారు. ఆ బిల్లులు చూసుకున్న వినియోగదారులు ఓటు వేయకండా ఉండగలరా ?
అలాగే రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించేందుకు వీలుగా విధివిధానాలను సిద్ధం చేశారు. ‘ప్రభుత్వ సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా? లేక ఏజెన్సీలకు చెల్లించాలా? ఈ క్రమంలో వచ్చే అడ్డంకులు, ఇబ్బందులపై ఇప్పటికే అధ్యయనం పూర్తి చేశారు. ఈ పథకంలో ఒక్క సారి లబ్దిదారులకు.. ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ ఇస్తే.. మహిళల ఓట్లు గుంపగుత్తగా పడిపోతాయి. రేవంత్ రెడ్డికి కావాల్సింది కూడా అదే. గ్యారంటీల అమలును చాలా పకడ్బందీగా ఉపయోగించుకునేందుకు సిద్ధమయ్యారు.