ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను నిందితురాలిగా చేరుస్తూ సీబీఐ ఇచ్చిన నోటీసులతో కాంగ్రెస్ ఉలిక్కి పడింది. మామూలుగా అయితే బీఆర్ఎస్ డిఫెండ్ చేసుకోవాలి. కానీ బీఆర్ఎస్ నేతలు ఎవరూ స్పందించలేదు. చివరికి కవిత కూడా స్పందించలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నేతలకు మాత్రం.. ఎప్పుడు 2022 డిసెంబర్ లో ఓ సారి ప్రశ్నించిన తర్వాత సీబీఐ మళ్లీ ఇప్పుడు .. అదీ లోక్ సభ ఎన్నికల ముందు నోటీసులు ఇవ్వడం వెనుక ఏదో స్కెచ్ ఉందని అనుమానిస్తున్నారు. ఈ అనుమానాలతో కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రెస్ మీట్ పెట్టేసారు.
కవితను నిందితురాలిగా చేర్చడం.. విచారణకు నోటీసుల వెనుక కుట్ర ఉందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెర ముందుకు వచ్చారు. లిక్కర్ స్కామ్లో కవితను నిందితురాలిగా చేర్చడం ఓ డ్రామా అన్నారు. లోక్సభ ఎన్నికల కోసమే ఈ కేసును మళ్లీ తెరపైకి తెచ్చారన్నారు. కవితను అరెస్టు చేస్తే కేసీఆర్ ఫ్యామిలీ రోడ్డెక్కుతుందన్నారు. సింపతీతో ఎంపీ సీట్లు గెల్చుకోవాలని బీఆర్ఎస్ ప్లాన్ అని జగ్గారెడ్డి ఆరోపించాు. కాంగ్రెస్కు వచ్చే సీట్లు గండి కొట్టేలా.. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ప్లాన్ చేస్తున్నాయన్నారు.
జగ్గారెడ్డి ఆందోళనలో రాజకీయం ఉందని అనిపిస్తున్నా.. అంతగా సానుభూతి పండిచాలనుకుంటే.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అరెస్టు చేసే ప్లాన్ అమలు చేసి ఉండే వారు కదా.. అలా చేసి ఉంటే.. జగ్గారెడ్డి చెప్పినట్లుగా సానుభూతి వెల్లువ వచ్చి అసలు కాంగ్రెస్ గెలిచి ఉండేది కాదుగా అని.. ఎవరికైనా అనిపించవచ్చు. కేసీఆర్ కుటుంబంపై చర్యల తీసుకుంటే ప్రజల్లో సానుభూతి వస్తుందేమోనని కాంగ్రెస్ కంగారు పడుతున్నట్లుగా జగ్గారెడ్డి మాటలు ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. నిజంగా కవితను అరెస్టు చేసినా.. ఇప్పుడు బీఆర్ఎస్ కక్ష సాధింపలేనని డిఫెండ్ చేసుకునే పరిస్థితి లేదు. బీజేపీపై నేరుగా ఆరోపణలు చేయడం ఆపేసి చాలా కాలం అయింది.