జగన్ రెడ్డి ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రజలు ఆయిదేళ్లు అధికారం ఇచ్చారు. ఆయిదేళ్లలో మొత్తం సర్దుబాటు చేసుకోవాలి. లేకపోతే చేతకాని తనం అవుతుంది. అందుకే… ఏపీలో ఉన్న ఆస్తులు… గనులు.. ఇసుక..రేవులు.. కాంట్రాక్టులు.. భూములు… ఇలా ఏవైనా సరే అన్నీ బినామీలకు అస్మదీయులకు రాసేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో కొన్ని సంస్థలకు వేల ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయిపోతున్నాయి. నిన్నామొన్న పుట్టిన కంపెనీలు.. గాలి మరలు ఏర్పాటు చేస్తామంటే వేల ఎకరాలు ఇచ్చేస్తున్నారు. వేల కోట్ల పెట్టబుడులు వస్తున్నాయని చెబుతున్నారు.
కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామని చెప్పి ఐదేళ్లలో రెండు సార్లు శంకుస్థాపన చేసిన జగన్ రెడ్డి… చివరికి జిందాల్ కంపెనీ ఓనర్ తో కలిసి క్విడ్ ప్రో కో ప్రారంభించారు. ఆ కంపెనీ తీసుకున్న స్థలాలకు ప్రహరీ కట్టి ఊరుకుంది.కానీ ఓబుళాపురం గనులన్నీ కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అది కూడా.. నేరుగా ఇస్తే… తర్వాత వచ్చే ప్రభుత్వాలు వెనక్కి తీసుకుంటాయి.. టెండర్లలోనే గెలుచుకున్నట్లుగా కనిపించడానికి… టెండర్ నాటకాలు ఆడుతున్నారు. ఓబుళాపురం గనుల్ని జిందాల్ కు కట్టబెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇప్పటికే గుట్టుచప్పుడు కాకుండా పెద్ద ఎత్తున స్థలాలను కేటాయిస్తూ పోతున్నారు. ప్రజా ఆస్తుల్ని ప్రైవేటు ప రం చేస్తున్నారన్న ఆరోపణలు చాలా కాలంగా వస్తున్నాయి. చివరికి రుషికొండ ప్యాలెస్ ను కూడా లీజుకిచ్చారని అంటున్నారు. ఇవన్నీ బయటకు రావాల్సి ఉంది. ఇప్పటికే దాదాపుగా రాష్ట్రానికి ఆస్తులేమీ లేకుండా సవరించేశారని.. వచ్చే పది రోజుల్లో ఊహించనంత దోపిడీ ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఆ వివరాలేమీ బయటకు రావు. ఎంత దోచుకున్నారన్నది… ప్రభుత్వం మారిదే కానీ బయట పడదు. ఎంత మంది ప్రైవేటు ఆస్తులు స్వాహా చేశారన్నది కూడా ప్రభుత్వం మారితేనే తెలుస్తుంది.