సిద్ధం సిద్ధం అని జగన్ రెడ్డి అరుస్తూనే ఉన్నారు. జాబితాల మీద జాబితాలు విడుదల చేస్తున్నారు. ఒక జాబితాలో ఉన్న వారి పేరు మరో జాబితాలో మార్చేస్తున్నారు. ఒక్క ఎంపీ అభ్యర్థి నికరంగా లేరు. ఇలాంటి సమయంలో వైసీపీ మీద టీడీపీ, జనసేన కూటమి యుద్ధం ప్రకటించేసింది. 99 మంది అభ్యర్థులతో రెండు పార్టీలు కలిసి మొదటి జాబితా ప్రకటించేశారు. ఇంకా షన్నికల షెడ్యూల్ రావడానికి రెండు వారాలకుపైగాసమయం ఉంది. ఈ లోపే జాబితా ప్రకటించారు.
జనసేన పార్టీ 24 అసెంబ్లీ 3 లోక్‌సభ
జనసేన పార్టీకి ఎన్ని సీట్లు కేటాయిస్తారన్నదానిపై కొంత మంది విపరీతంగా చర్చలు జరుపుతున్నారు. కానీ ఎన్ని సీట్లు తీసుకోవాలి.. ఎ సీట్లు తీసుకోవాలన్నదానిపై జనేసన చీఫ్ క్లారిటీగానే ఉన్నారు. 24 అసెంబ్లీ 3 లోక్ సభ సీట్లు తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. నిజానికి పొత్తులు అనుకున్నప్పుడు అందరూ అనుకున్న నెంబరే ఇది. మధ్యలో వైసీపీ స్పాన్సర్డ్ పొలిటికల్ శాస్త్రవేత్తలు.. జనసేనను రెచ్చగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే పవన్ కల్యాణ్ వారి ప్రయత్నాలన్నింటినీ వమ్ము చేశారు. సీట్ల ప్రకటన సమయంలో .. 98 శాత స్ట్రైక్ రేట్ ఉండేలా సీట్లను ఖరారు చేసుకున్నామని స్పష్టం చేశారు. దీంతో రెచ్చగొట్టాలనుకున్న వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఐదుగురిక సీట్లు ప్రకటించారు కూడా.
ప్రజల్లో ఉన్న వాళ్లే టీడీపీ అభ్యర్థులు
తెలుగుదేశంపార్టీ తరనపు ప్రకటించిన 94 మంది అభ్యర్థుల్లో ఒకటి రెండు తప్ప మిగతా అందరూ ప్రజల్లో ఉండి పని చేసుకుంటున్న వారే. వైసీపీ సర్కార్ పై పోరాటం చేసిన వారే. ఆయా నియోజకవర్గాల్లో వారికే సీటు అని ఇప్పటికే సంకేతాలు కూడా ఇచ్చారు. వర్గ పోరాటం అధికంగా ఉన్నక ల్యాణదుర్గం వంటి చోట్ల మూడో అభ్యర్థికి చోటు కల్పించి రెండు వర్గాలకు షాక్ ఇచ్చారు. ఉదయగిరి వంటి చోట్ల ఇంచార్జుల్ని మార్చి వేరే వారికి అవకాశం కల్పించారు. మొత్తంగా టీడీపీ అభ్యర్థుల జాబితా ఊహించిన విధంగానే ఉంది. బలమైన అభ్యర్థుల్ని ఖరారు చేసినట్లుగా స్పష్టమైంది.
బలమైన వాయిస్ ఉన్న దళిత నేతలకు అవకాశం
దళితుల్ని జగన్ రెడ్డి వాడుకునే విధానం వేరుగా ఉంటుంది. పదవుల పేరుతో వారిని కుర్చీలో కూర్చోబెట్టి.. వారికి వాయిస్ లేకండా చేసి పెత్తనం అంతా రెడ్డి సలహాదారులు చేస్తూంటారు. దళిత నియోజకవర్గాల్లోనూ అదే పరిస్థితి. అయితే టీడీపీ అధినేత.. గట్టి వాయిస్ ఉన్న దళిత అభ్యర్థులకు అవకాశం కల్పించారు. మహాసేన రాజేష్‌కు పి.గన్నవరం నుంచి చోటు కల్పించారు. కొలికపూడి శ్రీనివాస్ కు తిరువూరు సీటు కేటాయించారు. మొత్తంగా టీడీపీ, జనసేన కూటమి తొలి జాబితా.. పర్ ఫెక్ట్ గా ఉందని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. జగన్ రెడ్డి ఇప్పుడు మళ్లీ తన జాబితాలను సవరించుకునే అవకాశం కనిపిస్తోంది.