టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదరకూడదని.. పొత్తు కుదిరినా రెండు పార్టీల సీట్ల పంచాయతీ పెట్టాలని చాలా కాలంగా వైసీపీ వ్యూహకర్తలు చేస్తున్న ప్రయత్నాలన్నీ తేలిపోయాయి. సీట్ల సర్దుబాటు .. అభ్యర్థుల ప్రకటన తర్వాత వైసీపీ షాక్ గురైంది. పవన్ కల్యాణ్ 24 సీట్లే తీసుకున్నారంటూ తెర మీదకు వచ్చి ఏడవడం ప్రారంభించారు వైసీపీ నేతలు. ఇలా చంద్రబాబు, పవన్ ప్రెస్ మీట్ అయిపోగానే .. అలాగే మీడియాకు వచ్చేశారు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.
గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారని పేర్కొన్నారు. పవన్ ను చూస్తే జాలి వేస్తోందని అన్నారు. రాజకీయ పార్టీని నడిపే సత్తా పవన్ కళ్యాణ్ కు లేదని విమర్శించారు. అత్యంత దయనీయ స్థితిలో పవన్ ఉన్నారని చెప్పుకొచ్చారు. జనసేన పోటీ చేసే 24 సీట్లల్లో కూడా ఉన్నది చంద్రబాబు అభ్యర్థులే అని పేర్కొన్నారు. జనసేనను మింగేసి చంద్రబాబు ప్రయోజనం పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. . 24 మందితో పవన్ కళ్యాణ్ వైసీపీ పై యుద్ధం చేస్తారా అని తనకు మాత్రమే రాజకీయం తెలిసినంత తెలివిగా మాట్లాడారు.
వారి వద్ద చెప్పుకోవడానికి ఏమీ లేదని ఏదోలా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలన్న ఆరాటమే కనిపిస్తోందన్నారు. ఇక్కడ బీజేపీ ప్రస్తానన లేకుండా జాబితా విడుదల చేశారన్న సంగతిని కన్వీయనెంట్ గా నమర్ిచపోయారు. అసెంబ్లీ ఎన్నికల పొత్తుల్లో భాగంగా జనసేన 24 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయంచడంపై అధికార పక్షం ఉలిక్కి పడుతుంది. స్మూత్ గా వ్యవహారాలు జరిగిపోవడం తట్టుకోలేకపోతోంది. అందుకే .. జనసైనికుల్ని రెచ్చగొట్టేందుకు ఓ మిషన్ ను ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది.