మార్చిలో వస్తున్న సినిమాల్లో గోపీచంద్ ‘భీమా’ ఒకటి. కన్నడ దర్శకుడు ఎ.హర్ష దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్ బయటికి వచ్చింది. ట్రైలర్ అంతా యాక్షన్, ఎలివేషన్స్ తో నిండిపోయింది. ట్రైలర్ లో కథ చెప్పలేదు కానీ ‘దుష్ట సంహారం’ కథానాయకుడి లక్ష్యమని అర్ధమౌతుంది. పరసురాముని క్షేత్రం గురించి పవర్ ఫుల్ వాయిస్ ఓవర్ తో వివరించి తర్వాత కరుణే చూపని బ్రహ్మ రాక్షసుడు గా గోపీచంద్ పాత్రని పరిచయం చేశారు. ఈ క్రమంలో వచ్చిన యాక్షన్ సీన్లు ఎఫెక్టివ్ గా వున్నాయి. గోపిచంద్ పోలీస్ గెటప్ సాలిడ్ గా వుంది. ”నేను ఊచకూత మొదలుపెడితే ఊర్లో స్మశానం కూడా సరిపోదు’ అనే డైలాగ్ హీరో క్యారెక్టర్ ని తెలియజేస్తుంది. అన్నట్టు ట్రైలర్ చివర్లో చూపించిన ఓ సీక్వెన్స్ ఆసక్తికరంగా వుంది. ఇందులో సూపర్ నేచురల్ ఫాంటసీ ఎలిమెంట్ కూడా వుందని ఆ షాట్ చూస్తే అర్ధమౌతుంది. రవి బసృర్ బీజీఎం హైవోల్టేజ్ లో వుంది. ప్రొడక్షన్ లో క్యాలిటీ కనిపించింది. దర్శకుడు హార్స చాలా మ్యాసీవ్ గా యాక్షన్ సీన్స్ తీశాడు. మార్చి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.