తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించిన 94 మంది అభ్యర్థుల జాబితాలో అందరి విద్యార్హత మినిమం డిగ్రీ ఉంది. ఒక్కరు కూడా అంత కంటే తక్కువ చదువుకున్నవారు లేరు. వీరిలో 30 మంది పీజీ చేశారు. ముగ్గురు ఎంబీబీఎస్ చేశారు. ఇద్దరు పీహెచ్డీ చేశారు. ఒకరు ఐఏఎస్ ఆఫీసర్ గా చేసి రిటైరైన వారు ఉన్నారు. మరో 63 మంది డిగ్రీ పాసయ్యారు. అందరూ చదువుకున్న వారికి చాన్సివ్వడం.. ప్రజల్ని ఆకర్షిస్తోంది.
అటు యువతరానికి ఇటు అనుభవానికి చంద్రబాబు పెద్దపీట వేశారు. 35 ఏళ్లలోపు వయసు ఉన్న వాళ్లు ఇద్దరే ఉన్నారు.కానీ 45 ఏళ్లలోపు వయసు ఉన్న వారు 22 మంది ఉన్నారు. ఇక 46 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు 55 మంది ఉన్నారు. ఇక అరవై ఏళ్లు పైబడిన వారు ఇరవై మంది ఉన్నారు. మొత్తంగా పదమూడు మంది మహిళలు కూడా జాబితాలో ఉన్నారు. వీరంతా విద్యాధికులే.
దళితులకు ఇరవై సీట్లలో అభ్యర్థుల్ని ప్రకటించారు. వీరంతా ఉన్నత విద్యావంతులే. దళిత వాయిస్ ను గత ఐదేళ్లుగా గట్టిగా వినిపిస్తున్న సరిపెల్ల రాజేష్ .. మహాసేన రాజేష్ కు పి.గన్నవరం సీటును కేటాయించారు. అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కొలికపూడి శ్రీనివాస్ కు తిరువూరు సీటు కేటాయించారు. మొదటి జాబితాలో అభ్యర్థులు టీడీపీ ప్లస్ అన్న అభిప్రాయం వినిపిస్తోంది.