జగన్ రెడ్డి ఉద్యోగుల సొమ్ములు రూ. ఇరవై ఒక్క వేల కోట్లు నొక్కేశారని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతూ వస్తున్నారు. కానీ అడిగే ధైర్యం లేదు. ఉద్యోగులదే కాదు.. సివిల్ సర్వీస్ అధికారుల డబ్బులూ నొక్కేశారట సీఎం గారూ. గత ఇరవై ఐదు నెలలుగా సివిల్ సర్వీస్ అధికారుల జీతాల్లోంచి కత్తిరిస్తున్న సొమ్ములు సీపీఎస్‌కు జమ చేయడం లేదు. ఈ విషయం తెలిసి భగ్గుమంటున్నారు సార్లు. తాజాగా ఐఏఎస్ అధికారుల సంఘం సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో చర్చించాలనుకున్నారు. ఎజెండాలో పెట్టాలనుకున్నా .. కొంత మంది అయ్యాఎస్ లు అడ్డుకున్నారు. చర్చిద్దాం కానీ.. బయటకు తెలియకుండా చేసుకుందాం అని లాబీయింగ్ చేశారట.
ఏపీలో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు జగన్ రెడ్డికి గులాం గిరీ చేస్తూంటారని చాలా మంది అనుకుంటారు. కానీ అలా చేసేది నిజమే కానీ అందరూ కాదు. పిడికెడు మందే. అతి కొద్ది మందికి కీలక పోస్టులు ఇచ్చి.. వారి పేరుతో సలహాదారులు తప్పుడు పనులన్నీ చేస్తూంటారు. తమకు పోస్టింగ్ ఉంది కదా అని వారు సైడ్ సంపాదన చూసుకుంటారు. అయితే నీతిగా నిజాయితిగా ఉన్న వారు మాత్రం.. ప్రాధాన్యత లేని పోస్టుల్లో ఉంటున్నారు. వీరు ప్రభుత్వం.. తమ సొమ్ముల్ని వాడేసుకోవడంపై మండి పడుతున్నారు. అందుకే చర్చించాలని నిర్ణయించుకున్నారు.
ఏపీని జగన్ రెడ్డి ఏ దుస్థితికి తీసుకెళ్లారో బయటకు వచ్చే వరకూ ఎవరికీ తెలియదు. లెక్కలు బయటకు రావాలంటే.. ప్రభుత్వం పోవాలి. కొత్త ప్రభుత్వం రావాలి. అప్పటి వరకూ.. ఎవరి ఆస్తులుఉన్నాయి…. ఎవరి ఆస్తులు పోయాయో కూడా తెలియదు. చివరికి ఐఏఎస్.. ఐపీఎస్‌లకు కూడ.