ప్రతి ఆరు నెలలకు జగన్ రెడ్డి రోడ్లపై సమీక్ష పెట్టారని.. ఇక నున్నగా సాగిపోదామనే టైటిల్ తో సాక్షిలో వార్త వస్తుంది. ఇది ఐదేళ్లలో పది సార్లు జరిగింది. ఇప్పుడు కూడా మాట మార్చలేదు. మళ్లీ గెలిపిస్తే ఆరు నెలల్లో నున్నంగా సాగిపోవచ్చని చెబుతున్నారు మంత్రులు.. ఎమ్మెల్యేలు. ఇదే మాట మేనిఫెస్టోలో కూడా పెడతారట. ఐదేళ్లలో కరోనా వల్ల.. కాకరకాయల వల్ల డబ్బులు సరిపోలేదని ఈ సారి మాత్రం గెలిపించగానే రోడ్లన్నీ వేయిస్తామని చెప్పబోతున్నారు.
రోడ్ల కోసం.. ప్రతీ లీటర్ పెట్రోల్, డీజిల్ మీద రూపాయి వసూలు చేస్తున్నారు. అసలు పన్నులకు ఈ రూపాయి అదనం. కానీ డబ్బులేమీ రోడ్ల కోసం కేటాయించలేదు. పెద్ద ఎత్తున బ్యాంకులు.. అంతర్జాతీయ. సంస్థల నుంచి రోడ్ల పేరుతో రుణాలు తీసుకున్నారు. అన్నీ దారి మళ్లించారు. ఫలితంగా మరోసారి రోడ్ల పేరుతో రుణాలిచ్చేందుకూ ఎవరూ ముందుకు రారు. ఓ రకంగా రాష్ట్ర భవిష్యత్ ను..నమ్మకాన్ని ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసింది. ఇప్పుడు మళ్లీ ఆరు నెలల్లో రోడ్లేస్తామని చెప్పేందుకు సిగ్గుపడకుండా తెరపైకి వస్తోంది.
ఏ ప్రభుత్వమైనా మౌలిక సదుపాయాలకు పెద్ద పీట వేయాలి. అలా ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది.కానీ మీకు ఐదు వేలు ఇచ్చాం కదా.. ఇంకా రోడ్లు ఎక్కడివి అని ప్రశ్నిస్తారు వైసీపీ పాలకులు. అంటే.. కోటి వాళ్లు బుక్కి.,. ఐదు వేలు ప్రజలకు ఇచ్చి… ఇంక రోడ్లెందుకు అని అడుగుతున్నట్లుగా పరిస్థితి ఉంది. ఇంత దౌర్భాగ్యమైన పాలన చేసింది కాకుండా.. ఆరు నెలలలో రోడ్లు అంటూ… ప్రతిపక్షంలో ఉన్నట్లుగా హామీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. వీరి వ్యవహారాలకు ఎవరైనా సిగ్గుపడతారో లేదో.. కానీ జనం మాత్రం సిగ్గుపడే పరిస్థితి