హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఫ్రెండ్స్ తో డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ దొరికిపోయాడు బీజేపీ సీనియర్ నేత గజ్జల యోగానంద్ కుమారుడు వివేకానంద.. మరో మాజీ సీఎం అల్లుడు. మరో వ్యక్తి. మొత్తం ముగ్గురు కలిసి గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో ఓ రూమ్ తీసుకుని డ్రగ్స్ సేవిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు రెయిడ్ చేసి పట్టుకున్నారు. కొకైన్ లాంటి అత్యంత ఖరీదైన డ్రగ్స్ ను వీరు సేవిస్తున్నట్లుగా తెలుస్తోదంి. పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
రాడిసన్ హోటల్ గజ్జలయోగానంద దే కవడంతో ఎవరూ పట్టుకోలేరన్న ధైర్యంతో వారు డ్రగ్స్ వాడుతున్నట్లుగా తెలుస్తోంది. మాజీ సీఎం అల్లుడితో వ్యాపార సంబంధాలు ఉండటంతో… అందరూ కలిసి డ్రగ్స్ పార్టీలకు అలవాటు పడినట్లుగా చెబుతున్నారు. తెలంగాణలో ప్రభుత్వం మారిన తరవాత డ్రగ్స్ కట్టడిపై పూర్తి స్థాయిలో దృృష్టి పెట్టారు. ఈ క్రమంలో డ్రగ్స్ పెడ్లర్లు, వినియోగదారులపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు. కింది స్థాయిలో కట్టడి చేయగలిగినా.. స్టార్ హోటల్స్ లో గుట్టుగా డ్రగ్స్ వాడకం జరుగుతోందని తెలియడంతో నిఘా పెంచి… డ్రగ్స్ వాడకందారులను పట్టుకుంటున్నారు.
గజ్జల యోగానంద్ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీజేపీ కీలక నేతగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన చివరి క్షణం వరకూ టిక్కెట్ ఆశించారు. అయితే కొండా విశ్వేశ్వర్ రెడ్డి పట్టుబట్టి… మరో నేతకు ఇప్పించారు. అయినప్పటికీ.. గజ్జల యోగానంద్ కు బీజేపీలో మంచి పలుకుబడి ఉంది. ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం అల్లుడికి కూడా వివాదాస్పద చరిత్ర ఉన్నట్లుగా తెలుస్తోంది.