దేశంలో ఇప్పుడు ఒక్క వీడియో హాట్ టాపిక్ అవుతోంది. అది ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ధృవ్ రాఠీ తన యూట్యూబ్ చానల్ ద్వారా రిలీజ్ చేసిన వీడియో. ఉత్తరాది ప్రజలకు ధృవ్ రాఠీ బాగా తెలుసు. ఆయన నిజాల్ని నిర్భయంగా బయట పెడతారు. అందుకే కోటిన్నర మంది ఆయన చానల్‌కు సబ్స్క్రయిబర్లుగా ఉన్నారు . ప్రభుత్వానికి వ్యతిరేకమైనా… ప్రజలకు ఉపయోగపడే విషయాలను పకడ్బందీగా ప్రజల ముందు పెడుతూంటారు. అలా ఈ వారం ఆయన పెట్టిన వీడియో… ద డిక్టేటర్. నిర్మోహమాటంగా.. మోడీ బొమ్మ పెట్టేసి.. డిక్టేటర్ అని టైటిల్ తో వీడియో చేశారు.
ఇందులో ఆయన ప్రజాస్వామ్యానికి ఏర్పడిన పెను ప్రమాదం గురించి వీలైనన్ని ఎక్కువ అంశాలను… ప్రజలను ఆలోచింప చేసిన ఘటనలను ప్రస్తావించారు. రాజకీయాల్లో మోడీ మాత్రమే కనిపించేలా వినిపించేలా చేస్తున్న మీడియా.. ఆయనను దేవుడిగా చూపిస్తున్న మీడియా దగ్గర నుంచి.. ప్రజాస్వామ్యాన్ని ఎలా హత్య చేస్తున్నారో చండీగఢ్ మేయర్ ఎన్నికల వరకూ ప్రతీ విషయాన్ని విశదీకరించారు. ఎన్నికల వ్యవస్థను ఎలా మ్యానిపులేటింగ్ చేస్తున్నారో .. కేసుల పేరుతో రాజకీయ నేతల్ని ఎలా దారికి తెచ్చుకుంటున్నారో స్పష్టం చేశారు. ధృవ్ రాఠీ చెప్పిన విషయాలన్నీ నిజాలే..కళ్ల ముందు జరిగినవే. జరుగుతున్నవే.
కానీ దేశంలో ప్రజల కళ్లకు ఓ మైకం కమ్మేలా చేయడంలో … బీజేపీ.. మోడీ ఫ్యాన్స్ సక్సెస్ అయ్యారు. ఆ మైకం తెరలు తొలగేలా చేసేందుకు ధృవ్ రాఠీ గట్టి ప్రయత్నం చేశారని అనుకోవచ్చు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ధృవ్ రాఠీ పై కొన్ని కేసులు నమోదయ్యాయి. మరికొన్ని నమోదవ్వవొచ్చు. కానీ ఆయన తాను చెప్పాలనుకున్నది దేశం కోసం చెప్పారు. అందుకే.. ఆ నిజాయితీ ప్రయత్నం అందర్నీ ఆకర్షిస్తోంది.