ఇగ్లాండ్తో అయిదు టెస్టుల సిరీస్ను మరో మ్యాచ్ ఉండగానే 3-1తో కైవసం చేసుకుంది భారత్. 192 పరుగుల ఛేదనలో 40/0తో నాలుగవ రోజు ఆట మొదలుపెట్టిన ఇండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి మ్యాచ్ తో పాటు సిరిస్ ను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 353 పరుగులు చేసింది. ఇండియా 307 పరుగులకు ఆలౌట్ అయ్యింది. వికెట్ కీపర్ ద్రువ్ జురెల్ 90 పరుగులతో టీంని తొలి ఇనింగ్స్ లో ఆదుకున్నాడు. 40 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ ను145 పరుగులకే ఆలౌట్ చేసింది భారత్. అశ్విన్ ఐదు కీలక వికెట్లు పడగొట్టాడు. 192పరుగులతో రెండో ఇనింగ్స్ మొదలుపెట్టిన భారత్ ను కెప్టన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో విజయానికి గట్టి పునాదులు వేశారు. పటిదర్, సర్ఫరాజ్, జడేజా సింగిల్ డిజిట్లకు అవుట్ అయినప్పటికీ శుభ్ మన్ గిల్ ((52) జురెల్( 39) అంతకుముందు జైస్వాల్ (37) పరుగులతో లక్ష్యాన్ని చేధించారు. అశ్విన్, జురెల్, రోహిత్ శర్మ, గిల్, జైస్వాల్ లాంటి ఆటగాళ్ళు ఈ మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించారు.