కుప్పంకు నీళ్లు తెచ్చానని జగన్ రెడ్డి గొప్పలు పోయారు. కుప్పానికి తానే ఏదో చేశానని చెప్పుకున్నారు. కానీ అసలు నీళ్లు లేవు. ఆయన బటన్ నొక్కిన దగ్గర కాలువలో గట్టిగా ఒక్క ట్యాంకర్ నీళ్లు కూడా కనిపించలేదు. మోటార్ ఆన్ చేసినా చిన్న ధారగా బయటకు వస్తున్నాయి. వాటిని నీళ్లు ఇవ్వడం అంటారా లేకపోతే షో చేయడం అంటారా అన్నది ఆయనకే తెలియాలి.
బహిరంగసభలో మాత్రం చాలా గొప్పలు పోయారు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా గతంలోనే చంద్రబాబు కుప్పంకు నీళ్లు తీసుకు వచ్చారు 87 శాతం పనులు పూర్తయ్యాయి. మొదటి ఏడాదిలోనే మిగతా పనులు పూర్తి చేసి ఉంటే.. గత మూడేళ్లుగా కుప్పం వాసులకు పూర్తి స్థాయిలో నీరు అందేవి. అయితే అన్నీ పనుల్ని ఆపేశారు. ఇప్పటికీ పూర్తిగా పనులు కాలేదు. కొన్ని చోట్ల పంప్ హౌస్ పనులు ఆగిపోయాయి. అయితే మొత్తం శ్రీశైలం నుంచి తానే నీళ్లు తెచ్చినట్లుగా జగన్ రెడ్డి గప్పాలు కొట్టుకున్నారు.
నీళ్లు ఇవ్వడం అంటే.. పులివెందులకు చంద్రబాబు ఇచ్చినట్లుగా ఉండాలి. వైఎస్ పూర్తి చేయలేని పనిని గండికోట ప్రాజెక్టు పూర్తి చేసి చంద్రబాబు నీళ్లు ఇచ్చారు. ఎన్నికలకు ముందు కాదు. మూడేళ్ల ముందే. ప్రస్తుతం వైసీపీలో ఉన్న సతీష్ రెడ్డి అప్పట్లో జగన్ రెడ్డికి ప్రధాన ప్రత్యర్థి. ఆయన గడ్డాలు పెంచుకుని నీళ్లిచ్చిన తర్వాతనే గడ్డం చేయించుకుంటానని సవాల్ చేసి అనుకున్న విధంగా పనులు పూర్తయ్యేలా చూసుకున్నారు. అప్పట్లో అన్ని చెరువులు నిండిపోయాయి. ఇప్పుడు కుప్పంలో నాలుగైదు కిలోమీటర్లు పారితో కుప్పం కాలువల్లో కూడా నీరు కనిపించదు.
ఈ ఏడాది వర్షాలు సరిగ్గా లేదు. రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను కూడా సాధించలేకపోయారు. కుప్పానికి నీళ్లిచ్చామని చెప్పుకునేందుకు అనంతపురం, కర్నూలు జిల్లాల్లో రైతుల్ని ఎండబెట్టారు. కానీ ఆ నీళ్లుఎటూ కాకుండా కాలువలకే సరిపోతున్నాయి.