ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్‌లో వైసీపీ నేతల పెత్తనం పెరిగి చివరికి అది అంతర్జాతీయ ఆటగాళ్ల కెరీర్ ను నాశనం చేసే దిశగా వెళ్లింది. ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు కూడా ఆడిన హనుమ విహారిని కొద్ది రోజుల కిందట అవమానకరంగా కెప్టెన్సీ నుంచి తప్పించారు. అయితే ఆయనే రాజీనామా చేశాడని ప్రచారం చేశారు. కానీ నిజమేంటో నిలకడగా తెలుస్తోంది.
17వ ప్లేయర్ ఫిర్యాదుతో హనుమ విహారీని కెప్టెన్సీ నుంచి తొలగింపు
ఇటీవల ఆంధ్ర వర్సెస్ బెంగాల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా హనుమ విహారి ఉన్నరు. అయితే జట్టులో 17వ ప్లేయర్ కేఎన్ పృధ్వీరాజ్ ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో విహారి ఆయనపై మండిపడ్డారు. ప్రవర్తన మార్చుకోవాలని సూచించారు. అయితే ఆ మ్యాచ్ ముగిసిన కాసేపటికి విహారిని కెప్టెన్ గా తొలగిస్తూ… ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. పైగా ఆయనే రాజీనామా ప్రకటించారని చెప్పుకుంది. అయితే విషయం ఆలస్యంగా బయటకు తెలిసింది. ఈ ఘటనపై తీవ్ర మనస్థాపం చెందిన హనుమ విహారి.. ఇకపై ఆంధ్ర జట్టుకు ఆడను అంటూ ఇన్ స్టా గ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. హనుమ విహారి పోస్టుకు కౌంటర్ ఇచ్చిన “ఏం పీకలేవు” అంటూ స్టోరీ పెట్టిన కేఎన్ పృధ్వీరాజ్.. మరింత రెచ్చగొట్టారు.
ఆ 17వ ప్లేయర్ తండ్రి తిరుపతిలో ఓ కార్పొరేటర్ – భూమనకు నమ్మిన బంటు
ఇంతకీ ఈ కెఎన్ ఫృధ్వీరాజ్ ఎవరు అంటే.. తిరుపతి కార్పొరేషన్ లో ఓ డివిజన్ కార్పొరేటర్ నరసింహ కుమారుడు. అడ్డగోలు సిఫారసులతో.. టీమ్‌లోకి వచ్చింది కాకుండా ఇంటర్నేషనల్ ప్లేయర్ అయిన విహారీని టార్గెట్ చేసుకున్నారు. విహారీ అసంతృప్తి వ్యక్తం చేస్తే .. తన తండ్రి ద్వారా.. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పెద్దలపై ఒత్తిడి తెచ్చి ఏకంగా విహారీని కెప్టెన్సీ నుంచే తొలగించారు. నరసింహా .. టీడీడీ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డికి సన్నిహితుడు. కరుణాకర్ రెడ్డి అడిగితే వియసాయిరెడ్డి చేయుకండా ఉండరు.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అంతా విజయసాయిరెడ్డి గుప్పిట్లో
ఆంధ్రా క్రికెట్ వ్యవహాలన్నీ విజయసాయిరెడ్డి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఆయన అల్లుడు సోదరుడు అయిన పెనాక శరత్ చంద్రారెడ్డిని అధ్యక్షుడ్ని చేశారు. మిగతా కార్యవర్గం అంతా.. విజయసాయి చేతుల్లోనే ఉంటారు. ఆయన చెబితే వెంటనే విహారిని కెప్టెన్ పదవి నుంచి తొలగించారు. నిజానికి హనుమ విహారి గతంలో వైసీపీకి సపోర్టుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు. ఇప్పుడు ఆయన కెరీర్ ను కూడా.. చిదిమేశారు.