ఎండా కాలం వచ్చేసింది. ఇప్పుడు ఫిబ్రవరిలోనే వచ్చేస్తోంది. ఎండలు మండిపోతున్నాయి. గత ఏడాది వర్షాల్లేక ప్రజలు మలమల్లాడిపోతున్నారు. దానికి ఎండ తోడవుతోంది. పైగా పవర్ కోసం పోరాటం చేయాల్సిన ఎన్నికలూ వచ్చాయి. ఇప్పుడు నిజంగానే పవర్ సమస్య వచ్చింది. . కరెంట్ వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. కానీ దానికి తగ్గ సరఫరా లేదు. దీంతో ఏపీలో కరెంట్ కోతలు అనివార్యమయ్యాయి. ఇప్పుడే పలు జిల్లాల్లో రెండు నుంచి నాలుగు గంటల కోత విధిస్తున్నారు. ముందు ముందు ఈ కోత మరింత పెరగనుంది.
మార్చిలో ఎండలు మరింత మదురుతాయి. పోలింగ్ ఏప్రిల్ రెండో వారంలో ఉంటుంది. అప్పటికి పవర్ సమస్య ప్రజలను చుట్టు ముడుతుంది. ఎందుకంటే బహిరంగ మార్కెట్లో కొనలేని పరిస్థితి ఇప్పటికే ఏర్పడింది. పెద్ద ఎత్తున అప్పులు చేసి కొనుగోలు చేయాలనుకున్నా సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికలు ఒక నెల ముందే వస్తాయని.. గతంలో జగన్ చెప్పుకున్నారు. కరెంట్ కోతలు ఉండే అవకాశం ఉన్నందున ఎన్నికలు ముందే వస్తాయని చెప్పుకున్నారు. కానీ ఆ ఆశ కూడా నెరవేరలేదు. ఇంకా ఎన్నికలు ఓ వారం రోజులు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అసలే ప్రజలు కాక మీద ఉన్నారు. ఓటింగ్ కు వెళ్లే ముందు పవర్ సమస్యలు వస్తే.. మరో ఆలోచన లేకుండా జగన్ రెడ్డి ప వర్ కట్ చేస్తారు. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పవర్ చార్జీలన్నీ తగ్గించేస్తానని పెద్ద పెద్ద బిల్డప్ ల ఇచ్చి.. ఐదేళ్లలో ఎనిమిది సార్లు రేట్లు పెంచారు. బిల్లులు రెట్టింపు చేశారు. ఇప్పుడు చాన్స్ వస్తే ఊరుకుంటారా ?