‘పుష్ష’లో పాటలన్నీ హిట్టే. ‘దాక్కో దాక్కో మేక’ అందులో ఒకటి. అందులో జీవితానికి సంబంధించిన ఫిలాసఫీ ఉంటుంది. దాంతో పాటు ‘గంగమ్మ జాతర’ ప్రస్తావన కూడా ఉంది. ‘గంగమ్మ తల్లి జాతర, కోళ్లూ పొట్టేళ్ల కోతరా’ అంటూ ఓ చరణంలో ప్రస్తావించారు కూడా. అయితే ‘పుష్ష 1’లో ఆ జాతర చూపించలేదు. ఇప్పుడు ‘పుష్ష 2’లో దానికి ఓ భారీ ఎపిసోడ్ కేటాయించారు. ఇంట్రవెల్ బ్యాంగ్ లో వచ్చే కీలకమైన ఎపిసోడ్ ఇది. సినిమాలో దాదాపు అరగంట సేపు ఉంటుంది. ఇందుకోసం చిత్రబృందం దాదాపు 35 రోజుల పాటు పని చేసింది. ఈ ఎపిసోడ్ కోసమే రూ.50 కోట్లకుపైనే ఖర్చు చేసింది. ఈ జాతర ఎపిసోడ్ లో బన్నీ లుక్ అదిరిపోనుందని టాక్. చేతులకు నెయిల్ పాలీష్, నుదుట బొట్టు.. ఇలా అర్థనారీశ్వర అవతారంలో బన్నీకి సంబంధించిన లుక్ ఒకటి బయటకు వచ్చింది. అది ఈ జాతర ఎపిసోడ్ లో రివీల్ అవ్వబోతోందని తెలుస్తోంది. ఓపాట, ఫైటు, సెంటిమెంట్ సీన్… ఇలా అన్నిరకాల భావోద్వేగాల్నీ ఈ ఒక్క ఎపిసోడ్‌లోనే మేళవించారని తెలుస్తోంది. అంతే కాదు.. ఓ కీలకమైన ట్విస్ట్ కూడా ఈ ఇంట్రవెల్ బ్యాంగ్ లో రాబోతోందని టాక్. పుష్ష 1, పుష్ష 2 మొత్తానికే ఈ ఎపిసోడ్ హైలెట్ కాబోతోందని చిత్రబృందం చెబుతోంది. ‘పుష్ష 2’లోని ఫస్టాఫ్‌ని ఓ హైతో ముగించడానికి సుకుమార్ రాసుకొన్న పకడ్బందీ ఎపిసోడ్ ఇది. ఈ సీన్‌తో బన్నీ ఫ్యాన్స్‌కు పూనకాలే అని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి.