ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ నిర్వహించాలనుకున్న ఆఖరి సిద్ధం సభను మరోసారి వాయిదా వేసుకున్నారు. రెండో తేదీన నిర్వహించాలనుకున్న ఆ సభను. పదో తేదీకి వాయిదా వేశారు. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లాలనుకుంటున్నారని .. మోదీ అపాయింట్ మెంట్ ఇచ్చే అవకాశం ఉందని అందుకే సభ వాయిదా అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే జగన్ కు ఇంకా అపాయింట్మెంట్ కన్ఫర్మ్ కాలేదు.
సిద్ధం సభ ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక సవాళ్ల కారణంగా వాయిదా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్పుల కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. పలు పథకాలతో పాటు రైతులకు మిచౌంగ్ తుపాను నష్టాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు. అసలు ఏమీ ఇవ్వలేకపోతున్నారు. అప్పుల పరిమితి ముగిసింది. ఈ క్రమంలో..త అదనపు రుణాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ అవబోతున్నారని అంటున్నారు. కానీ రెండు, మూడు తేదీల్లో ప్రధాని మోదీ హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. ఎన్నికల సమయం కావడంతో మోదీ చాలా బిజీగా ఉంటున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ సారి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు.
అప్పట్లో చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలతో భేటీ అయ్యారు. ఆ భేటీ తర్వాత ఏపీకి దాదాపుగా ఎనిమిది వేల కోట్ల అప్పు ఆర్బీఐ నుంచి లభించింది. ఇప్పుడు కూడా మరోసారి అదే తరహా ప్రయత్నాలు చేయాలని ఆలోచిస్తున్నారు. పొత్తుల అంశంపై కూడా బీజేపీ హైకమాండ్ ఆలోచిస్తోంది. టీడీపీని.. ఎన్డీఏలో చేర్చుకోవద్నది భారీ స్థాయిలో సీఎం జగన్ లాబీయింగ్ చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.