సిద్ధం అంటున్న జగన్‌కు యుద్ధం ఖాయమని సంకేతాలిచ్చారు. ఇన్ని సీట్లేనా అని రెచ్చగొడుతున్న వైసీపీ వారికీ .. వామనుడి ఉదాహరణ చెప్పి తొక్కిపడేయబోతున్నామని భవిష్యత్ చెప్పారు. ప్రశ్నిస్తున్న వారికి తనదైన పద్దతిలో.. తన వెంట నడిచేవాడే తన వాడని ప్రశ్నించే వారు కాదని తేల్చేశారు. పవన్ కల్యాణ్.. సుదీర్ఘంగా ప్రసంగించినా ఎక్కడా మాట పొల్లు పోలేదు. సూటిగా స్పష్టంగాతన సందేశాన్ని క్లియర్ గా అన్ని వర్గాలకూ పంపారు. అటు జగన్ కు.. ఇటు ప్రజలకు.. మరో వైపు సొంత పార్టీ నేతలకూ .. స్పష్టంగా సందేశం ఇచ్చారు.
సాధారణంగా పవన్ ప్రసంగంలో జంప్స్ ఉంటాయి. ఓ అంశంపై మాట్లాడుతున్నప్పుడు సడన్ గా మరో అంశం వైపు వెళ్తారు. కానీ ఈ సభలో అలా జరగలేదు. ఓ ఫ్లోలో స్టార్ట్ చేసి.. తాను చెప్పాలనుకున్నది చాలా క్లియర్ చెప్పారు. జగన్ కు యుద్ధం ఇవ్వడం ఖాయమని..రెడీగా ఉండాలన్నారు. తన పార్టీ కార్యకర్తల్ని రెచ్చగొడుతున్న వైసీపీ వారికి కౌంటర్ ఇచ్చారు. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్న వారికీ గట్టిగా ఇచ్చారు. జగన్ తనకు నలుగురు పెళ్లాలంటూ చేస్తున్న విమర్శలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. నీకు మొగుడ్ని నేనన్న అర్థంతో నాలుగో పెళ్లాం జగనేనని కౌంటర్ ఇచ్చారు.
తక్కువ సీట్లు అంటూ విమర్శలు చేస్తూ.. జనసేనానికి సలహాలు ఇచ్చేందకు ప్రయత్నిస్తున్న్ వారికి కట్ చేసి పడేశారు. సలహాలు ఇవ్వొద్దని తన వెంట నడవాలని సూచించారు. పదేళ్లుగా అవమానాలు పడుతూ రాజకీయాలు చేస్తున్నానన్నారు. తాను ఏం చేయాలో.. ఏం చేయాలో స్పష్టత ఉందన్నారు. తనను ప్రశ్నించకుండా తనతో పాటు నడిచేవారే తన వారని తేల్చి చెప్పారు. దీంతో సొంతపార్టీలో ఉండే.. జగనన్నకు ఓటు బ్యాచ్‌కు గట్టి స్ట్రోక్ ఇచ్చినట్లయింది. అదే సమయంలో టీడీపీ వెనుక నడవడం లేదని..కలిసే నడుస్తున్నామని స్పష్టం చేశారు. చంద్రబాబు అనుభవాన్ని పొగిడారు. టీడీపీకి ఉన్న సంస్థాగత బలాన్ని కూడా గుర్తు చేశారు.
జగన్ కు ఓటేస్తే ఏం జరుగుతుందో పవన్ విశదీకరించి చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని విడమర్చి చప్పారు. మొత్తంగా పవన్ కల్యాణ్ స్పీచ్.. సెటిల్డ్ గా.. క్లియర్ గా సాగింది. పవన్ నుంచి ఈ రకమైన ప్రసంగాలు వస్తే.. ప్రజల్లోనూ ఆయనపై ఉన్న సందేహాలు పటా పంచలు అవుతాయన్న అభిప్రాయం ఏర్పడింది.