రుషికొండను బోడిగుండు చేసి కట్టిన రుషికొండ ఇంటిని రోజా చేతుల మీదుగా ప్రారంభింప చేస్తున్నారు జగన్ రెడ్డి. గతంలో జగన్ రెడ్డి ప్రారంభించాలనుకున్నారు. కానీ కోర్టులో కేసులు ఉన్నాయి . అది అక్రమ నిర్మాణం అని తేల్చారు. కేంద్ర పర్యావరణ శాఖ నివేదిక ఇవ్వాల్సి ఉంది. అధ్యయనం చేసిన చైర్మన్ చివరి క్షణంలో చనిపోవడంతో రిపోర్టు ఆలస్యమవుతోంది. తాజా విచారణలోనూ… మరో రెండు వారాల సమయం కావాలని అడిగారు. దీంతో హైకోర్టు తీర్పు వాయిదా వేసింది.
ఇప్పుడు ఈ రుషికొండ ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించారు. సీక్రెట్ గా ఓపెనింగ్ నిర్వహిస్తున్నారు. పర్యాటక మంత్రి రోజా దీన్ని ప్రారంభిస్తున్నారు. అతి కొద్ది మందికే ఆహ్వానం పలుకుతున్నారు. కోర్టు సీరియస్ అవుతుందని తెలుసు కాబట్టి జగన్ రెడ్డి మాత్రం బటన్ నొక్కేందుకు వెనుకడుగు వేశారు. ఉత్తారంధ్రలో ఎన్నికల ప్రచారం చేయడానికి వచ్చినప్పుడు… అక్కడే బస చేస్తారని వైసీపీ వర్గాలంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలిచే చాన్స్ లేదు కాబట్టి.. కట్టుకున్నామని.. కొన్ని రోజులైన అనుభవించాలన్నట్లుగా …. అందులో బస చేసేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు.
చట్టబద్ధ నిర్మాణం .. శాశ్వత నిర్మాణం కూడా కానీ ప్రజావేదికలో మీటింగ్ పెట్టిన జగన్ రెడ్డి కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లుగా… అక్కడ్నుంచే కూల్చివేత ఆదేశాలిచ్చారు. అది ఏ విధంగా చట్ట వ్యతిరేక నిర్మాణమో ఇంత వరకూ తేల్చలేదు. కానీ రుషికొండకు గుండుకొట్టి అక్రమ నిర్మాణాన్ని మాత్రం శరవేగంగా పూర్తి చేశారు. అన్ని రకాల తప్పులూ చేశారు. ఇప్పుడు ఆ అక్రమ నిర్మాణంలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంత కన్నా సిగ్గులేని తనం.. జవాబుదారీ తనం లేని రాజకీయం… ఏ రాష్టంలోనూ ఉండదేమో ?