పొన్నూరు నుంచి అంబటి మురళి అనే నేతకు జగన్ రెడ్డి టిక్కెట్ ప్రకటించారు. ఎవరీ అంబటి మురళి.. అంబటి రాయుడి తమ్ముడా.. అంబటి రాంబాబు బంధువా అని చాలామంది ఆరా తీశారు. చివరికి అంబటి రాంబాబు సోదరుడని తేలింది. దీంతో అందరూ రాంబాబు వైపు జాలిగా చూస్తున్నారు. ఎందుకంటే… అంబటి మురళికి టిక్కెట్ ఇవ్వాలంటే.. బలి చేయాల్సింది రాంబాబునే మరి. అన్నదమ్ములిద్దరికీ టిక్కెట్ ఇచ్చే పరిస్థితి ఉండదు.
సత్తెనపల్లి టిక్కెట్ ను ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఖరారు చేశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ హామీతోనే ఆయన వైసీపీలో తిరిగి చేరారని అంటున్నారు. మంగళగిరిలో బీసీ అభ్యర్థినే ఉంటారని అందుకే ఆళ్ల చెబుతున్నారు. గుంటూరు ఎంపీ లేదా సత్తెనపల్లి సీట్లలో ఒకటి తీసుకోవాలని జగన్ ఆఫర్ ఇచ్చారు. సత్తెనపల్లికే ఆళ్ల మొగ్గు చూపారు. దీంతో అంబటి రాంబాబు సోదరుడికి పొన్నూరు టిక్కెట్ కేటాయించారు.. ఇప్పుడు అంబటి రాంబాబుకు సిగ్నల్స్ పంపుతున్నారు.
అంబటి రాంబాబు తనదే టిక్కెట్ అనుకుని.. పొత్తున్నే లేచి.. సత్తెనపల్లి వీధుల్లో డ్రామాలు ప్రారంభించారు. టీ కొట్డడం.. టీ గ్లాసుల్లో టీ పోయడం… దోసెలేయడం…. వంటి విన్యాసాలు చేస్తున్నారు. కానీ.. తొందరపడవద్దని ముందుగానే సంకేతాలు పంపారు. ఇక ఇప్పుడు రాంబాబు ఏం చేస్తారో ?. చేయడానికి ఏం లేదు.. అమర్నాథ్ లాగా… తన తలరాదను జగన్ రెడ్డి రాస్తారని.. చెప్పినట్లు చేయడమే. మరే పార్టీలోనూ అలాంటి వారికి చోటు ఉండదు.