మినిమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకొన్నాడు శ్రీవిష్ణు. తాజాగా `సామజవరగమన`తో ఓ సూపర్ హిట్టు కొట్టాడు. ఇప్పుడు తన స్పీడు మరింతగా పెంచాడు. శ్రీవిష్ణు కథానాయకుడిగా రెండు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ‘ఓం భీం భుష్’ విడుదలకు సిద్ధమైంది. శ్రీవిష్ణుతో పాటుగా ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ‘జాతిరత్నాలు’ టైపు సినిమా ఇది. దీంతో పాటుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. దీనికి ‘స్వాగ్’ అనే పేరు పరిశీలిస్తున్నారు. `రాజ రాజ చోర` ఫేమ్ ఆశిత్ గోలీ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇప్పుడు గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా ఒప్పుకొన్నాడు. ఈరోజు శ్రీవిష్ణు పుట్టిన రోజు. ఈ సందర్భంగా గీతా ఆర్ట్స్ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన రాబోతోంది. కార్తీక్ అనే కుర్రాడ్ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారని తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి. ప్రతీసారీ వెరైటీ జోనర్లు ఎంచుకొనే శ్రీవిష్ణు ఈ సినిమాతో మరో ప్రయోగం చేస్తున్నాడని టాక్. మరి ఆ ప్రయోగం ఏమిటో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఓపిక పట్టాలి.