విశ్వక్సేన్ సినిమాలంటేనే క్రేజీనెస్, ఎనర్జీ గుర్తొస్తాయి. అయితే ఇందుకు విభిన్నమైన దారిలో చేస్తున్న సినిమా ‘గామి’. ఈ సినిమాలో విశ్వక్ లుక్, తన స్క్రీన్ ప్రెజెన్స్, క్యారెక్టర్ ఇవన్నీ కొత్తగా కనిపిస్తున్నాయి. బహుశా… తన కెరీర్లో ఇదే పెద్ద ఎక్స్పెర్మెంట్ ఏమో..! విద్యాధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి 8న విడుదల కానుంది. ఇప్పుడు ట్రైలర్ వదిలారు.
దాదాపు 4 నిమిషాల సుదీర్ఘమైన ట్రైలర్ ఇది. హిమాలయాలు, జైలు గోడలు, దేవదాసి వ్యవస్థ, ఆశ్రమం, 36 ఏళ్లకు ఒక్కసారి వచ్చే అపురూమమైన ఘడియలు, మాలిపత్రాలూ అంటూ చాలా విషయాలు ఈ ట్రైలర్లో చెప్పే ప్రయత్నం చేశారు. కాస్త ఫాంటసీ, తాత్వికత, ఆచారాలు ఇవన్నీ కలగలిపిన నేపథ్యం ఈ సినిమా కోసం ఎంచుకొన్నారనిపిస్తోంది. కథ ప్రకారం హీరోకి ఓ సమస్య ఉంది. దాన్నుంచి విముక్తి పొందాలంటే హిమాలయాల్లో అరుదుగా వికసించే మాలిపత్రాల్ని సృశించాలి. మరి ఆ ప్రయత్నం ఎలా సాగింది? అనేదే కథ. దేవదాసి వ్యవస్థని చూపిస్తున్నారు కాబట్టి.. ఇది ఈ కాలానికి చెందిన కథ కాదన్నది అర్థం అవుతోంది. విజువల్స్ బాగున్నాయి. కథలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఇది రెగ్యులర్ ఫార్మెట్ లో సాగే కథ కాదన్న విషయం ట్రైలర్ చూశాక క్లియర్ కట్ గా అర్థం అవుతోంది. మరి ప్రేక్షకులు ఈ సినిమాని ఎలా ఆదరిస్తారో చూడాలి. చాందిని చౌదరి ఓ కీలకపాత్ర పోషించింది.