తాడేపల్లిగూడెం సభ ప్రసంగంతో పవన్ కల్యాణ్ అందరి అంచనాలను తలకిందులు చేశారు. ఎప్పుడూ లేని విధంగా సూటిగా, స్పష్టంగా తన సందేశాన్ని టీడీపీ, జనసైనికులకు..అటు వైసీపీ వారికి కూడా.. అది క్లియర్ గా అర్థమైంది. పవన్ ప్రసంగం రియాక్షన్స్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి. సీట్ల సర్దుబాటుపై పవన్ కల్యాణ్ ను ప్రశ్నించిన వారు.. పవన్ కల్యాణ్‌కు అసలైన స్ట్రాటజిస్టులం తామే అన్నట్లుగా వ్యవహరించిన వారంతా దాదాపుగా సైలెంట్ అయిపోయారు. సోషల్ మీడియాలో హడావుడి చేసిన వారు కిక్కురుమనడం లేదు. ఇక జనసేనతో మరింత సమన్వయం కోసం టీడీపీ నేతలు ఉమ్మడిగా ప్రచారాలు కూడా ప్రారంభించారు.
పవన్ స్పీచ్ అసలు గురి లక్ష్యాన్ని తాకింది. వైసీపీ నేతలు విలవిల్లాడిపోతున్నారు. పవన్ కల్యాణ్… వైసీపీపై.. జగన్‌పై పవన్ ఎక్కుపెట్టిన ప్రతీ మాటా తూటాల్లా పేలింది. తాను తీసుకున్న సీట్ల సంఖ్యపై వ్యాఖ్యలు చేస్తున్న వారికి గట్టిగా సమాధానం ఇచ్చారు. ఇంతేనా అంటున్నారని.. వాటితోనే తొక్కి పడేస్తామని హెచ్చరించారు. జగన్ ను పాతాళంలోకి తొక్కకపోతే తన పేరు మార్చుకుంటానని హెచ్చరించారు. పవన్ వ్యాఖ్యలతో వైసీపీ నేతలు ఉలిక్కిపడ్డారు. ముఖ్యంగా సీటు కోసం కాచుకుని కూర్చున్న వారు.. సీటు దక్కిన వారు తెరపైకి వచ్చారు. పేర్ని నాని .. పవన్ విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు లీడ్ తీసుకోగా చాలా మంది మాట్లాడారు.
పవన్ .. ఓ ముఖ్యమంత్రిని పట్టుకుని అలా ఎలా మాట్లాడతారని.. ఆగ్రహంతో కూడిన ఆవేదన వ్యక్తం చేశారు. కానీ జగన్ చేసే ప్రసంగాలతో పోలిస్తే.. పవన్ చాలా మర్యాదగా మాట్లాడారన్న అబిప్రాయమే ఎక్కువగావినిపిస్తోంది. టీడీపీ, జనసేన మధ్య గ్యాప్ పెంచాలనుకున్న వైసీపీ ప్రయత్నాలకు.. పవన్ కల్యాణ్ ఒక్క స్పీచ్‌తో కౌంటర్ ఇచ్చేశారని.. ఇక వైసీపీ నేతలు వేరే కుట్రలకు ప్లాన్ చేసుకోవాల్సిందేనన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.