సాక్షి టీవీకి 15 ఏళ్లు పూర్తయ్యాయి. కంపెనీ పేపర్ మీద ఉండగానే.. నాలుకు గీసుకోవడానికి కూడా పనికి రానిషేర్లను కోట్లకు కొనుగోలు చేసిన క్విడ్ ప్రో కో స్టార్లు ఇచ్చిన పెట్టుబడులతో.. విచ్చలవిడిగా ఖర్చు పెట్టి ప్రారంభించిన చానల్ .. తమ యజమానికి సేవ చేసుకుంటూ.. స్వకుచమర్దనంతో పయనం సాగిస్తూ పదిహేనేళ్లు పూర్తి చేసుకుంది. ప్రత్యర్థులు ఎవరైనా.. తల్లీ , చల్లీ అయినా వదలకుండా బురద చల్లడం… తాము ఏ తప్పు చేసినా సమర్థించుకోవడం.. సాక్షి ఎడిటింగ్ పాలసీ. ఆ విలువలతో ..అధికారంలో ఉన్నప్పుడల్లా ప్రభుత్వ ఖజానా నుంచి కావాల్సినంత ఆదాయం పొందుతూ ముందుకు సాగుతోంది.
అయితే సాక్షిని డిజైన్ చేసినప్పుడు.. యల్లో కలర్ ఎక్కువగా ఉండేలా చేశారు. దానికి అప్పట్లో జగన్ రెడ్డి ఎందుకు ఒప్పుకున్నారో తెలియదు కానీ.. యెల్లో మీడియా అని.. కొన్ని చానళ్లను విమర్శించేటప్పుడు నిజమైన యెల్లో మీడియా సాక్షినే కదా అన్న సెటైర్లు వినిపించేవి. కానీ ఎప్పుడూ వాటిని పట్టించుకోలేదు. కానీ హఠాత్తుగా పదిహేనో వార్షికోత్సవానికి మొత్తంగా బ్లూకు మార్చేశారు. నీలి చానల్ అని.. విపక్షాలు విమర్శిస్తున్నా.. అదేమి పట్టించుకోకుండా మేకోవర్ పూర్తి చేశారు.
ఈ డిజైన్ ను చేసే బాధ్యతను కూడా విదేశీ కంపెనీకి ఇచ్చారు. దాంతో తెలుగులో కూడా పేరు లేదు. ఇంగ్లిషన్ లో సాక్షి న్యూస్ అనే లోగోతో ఇచ్చేశారు. ఆ డిజైన్ల కన్నా యూట్యూబ్ చానళ్ల డిజైన్ బాగుంటుందన్న సెటైర్లు సాక్షి ఉద్యోగుల్లో వినిపిస్తున్నాయి. సాక్షి పత్రిక డిజైన్ ను కూడా బులుగులోకి మారుస్తారా లేకపోతే.. అంతే ఉంచుతారా అన్నది తేలాల్సి ఉంది. సాక్షి పత్రిక పూర్తిగా పసుపురంగులోనే కనిపిస్తుంది.