వైసీపీ అధినేత జగన్ కు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తటస్తుల పేరుతో కొంత మంది రంగంలోకి దిగి.. అప్పటి ప్రభుత్వంపై నిరంతరాయంగా బురదచల్లుతూ ఉండేవారు. వారంతా జగన్ రెడ్డికి సన్నిహితులే అని అందరికీ తెలుసు. అయినా సరే.. తటస్థుల ముసుగులో ప్రభుత్వంపై బురత చల్లడం చేసేవారు. ఊహకు అందని ఆరోపణలు చేసేవారు. గతంలో కొంత మంది ప్రముఖుల్ని పట్టుకుని కుల ఉన్మాదం రేపడానికి జగన్ రెడ్డి చేసిన ప్రయత్నాలు లెక్కలేనన్ని. దాని కోసం … మాజీ సీఎస్ల దగ్గర్నుంచి మాజీ న్యాయమూర్తుల వరకూ చాలా మంది రోడ్ల మీద పడిపోయేవారు.
తర్వాత వారిలో కొంత మంది పదవులు దక్కించుకున్నా మిగిలిన వారు సైలెంట్ అయిపోయారు. కొత్తగా తటస్థ ప్రముఖుల్ని ఏర్పాటు చేసుకోలేకపోయారు. తమ ప్రభుత్వానికి పొగడటానికి.. ప్రతిపక్షాన్ని విమర్శించడానికి… ఇలాంటి గ్రూప్ డీ యాక్టివేట్ అయిపోయింది. గతంలో తమ కోసం పని చేసిన వారిని రంగంలోకి దించాలన్నా.. వారు కూడా ముందుకు రావడం లేదు. అనంతపురంలో మాకిరెడ్డి అనే ఓ స్వయం ప్రకటిత మేధావి ఉండేవారు. ఆయనకు కూడా జగన్ రెడ్డిని సమర్థించడం నామోషీగా అనిపించింది. ఆయన కూడా మాట్లాడటం లేదు.
పరిస్థితి దిగజారిపోవడంతో… పెయిడ్ ఆర్టిస్టుల్ని రంగంలోకి దించుతున్నారు. సోషల్ మీడియాలో పేజీలను హైర్ చేసుకోవడం దగ్గర్నుంచి ముక్కూముఖం తెలియని వారితో మాట్లాడించి.. వాటిని హైలెట్ చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వాటిలో ఉన్న సారం తెలిసిన తరవాత.. ఇలాంటి చీప్ ట్రిక్కులు ఇప్పుడు కూడా పని చేస్తాయా అని వైసీపీ నేతలే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వస్తోంది.