విజయ్ దేవరకొండ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఒకదాని తరవాత మరో సినిమాపై సంతకాలు చేసేస్తున్నాడు. ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’తో బిజీగా ఉన్నాడు విజయ్. ‘రాజావారు రాణీగారు’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. మరోవైపు ‘జర్సీ’ గౌతమ్ తిన్ననూరి కథకు ఓకే చెప్పాడు. ఇవన్నీ ఒకదాని తరవాత మరోటి సెట్స్‌పైకి వెళ్తాయి. ఈలోగా మరో యువ దర్శకుడి కథకు పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది.
విశ్వక్సేన్ హీరోగా నటించిన ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు విద్యాసాగర్ చింతా. ఇప్పుడు విజయ్‌కి ఓ కథ వినిపించినట్టు తెలుస్తోంది. అది విజయ్‌కీ బాగా నచ్చింది. దాంతో ఈ సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు ఉన్నాయి. `ఫ్యామిలీ స్టార్` చిత్రానికి ఆయనే నిర్మాత. రవికిరణ్ కోలా, గౌతమ్ చిత్రాలూ దిల్ రాజు బ్యానర్లోనే నిర్మితమవుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమానీ విజయ్ ఆయన చేతుల్లో పెట్టినట్టు తెలుస్తోంది.