పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే ఇద్దరు లోక్ సభ అభ్యర్థులను కేసీఆర్ ఖరారు చేశారు. కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్., పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేస్తారని ప్రకటించారు. ఈ రెండు నియోజకవర్గాలకు చెందిన కీలక నేతలతో తెలంగాణ భవన్ లో కేసీఆర్ సమావేశం అయ్యారు.
ఎన్నికల షెడ్యూల్ మరో వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నా అభ్యర్థుల పై పట్టించుకోకపోవడతో టీఆర్ఎస్ పోటీ చేస్తుందా లేదా అన్న చర్చ జరుగుతోంది. చాలా మంది పార్టీ మారిపోతున్నారు. దీంతో కేసీఆర్ రెడీగా ఉన్న ఇద్దరి పేర్లను ప్రకటించారు. మిగతా పేర్లను ప్రకటించడానికి అభ్యర్థులు లేరు. ఇతర సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ దారి తాము చూసుకుంటున్నారు. సీనియర్ నేతలు పోటీకి వెనుకాడుతున్నారు. ఎక్కువ మంది బీజేపీ అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి వెళ్లిన వాళ్లే ఉంటున్నారు.
తాజాగా వర్థన్నమాట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మారేందుకు రెడీ అయ్యారు. ఆయనను బీఆర్ఎస్ నేతలు బుజ్జగిస్తున్నారు. వరంగల్ కీలక నేతలంతా కాంగ్రెస్ వైపు వెళ్తున్నారు. మేయర్ గుండు సుధారాణి కూడా ఈ జాబితాలో ఉన్నారు. పెద్ద నేతల కన్నా స్థానిక నేతల వలస ఎక్కువగా ఉండటం బీఆర్ఎస్ ను ఇబ్బంది పెడుతోంది.