ఓ మీడియా సంస్థ చర్చా కార్యక్రమంలో దేశంలోని రాజకీయ పరిస్థితుల్ని విశ్లేషించిన ప్రశాంత్ కిషోర్… తెలుగు రాష్ట్రాల గురించి కూడా తన ఆలోచనల్ని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఏపీలో పరిస్థితుల్ని చెప్పడానికి ఆయన మొహమాటపడలేదు. జగన్ సాదాసీదాగా ఓడిపోవడం లేదని .. ఊహించనంత ఘోరంగా ఆయన పరాజయం ఉండబోతోందని తేల్చేశారు. ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఒక్క సారిగా వైరల్ అయ్యాయి. ఎందుకంటే ఇంతకు ముందే దేశంలో ఉన్న క్రెడిబులిటి సర్వే సంస్థల్లోఒకటైన సీఓటర్… టీడీపీ, జనసేనలకు 52 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. ఇంత ఏక పక్షంగా ఎన్నికలు ఉంటే వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం.
అయితే ప్రశాంత్ కిషోర్ పై వెంటనే వైసీపీ మూక రంగంలోకి దిగింది. ఎప్పట్లా ఆయనపై చంద్రబాబు పేరతో తిట్టడం ప్రారంభించారు. ప్రశాంత్ కిషోర్ కు అసలు రాజకీయాలు తెలియవన్నట్లుగా అప్పటికప్పుడు పెద్ద పెద్ద కథనాలు సాక్షిలో రాసుకుంటున్నారు. వైసీపీ నేతల్ని రంగంలోకి దింపి విమర్శలుస్తున్నారు. ఎంత చేసినా ప్రశాంత్ కిషోర్.. ఓ స్ట్రాటజిస్టు మాత్రమే. పైగా ఆయన గత ఎన్నికల్లో వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆయనే జగన్ రెడ్డి ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారో చెబుతున్నారంటే అర్థమవుతుంది. గత ఏడాదిన్నరగా తాడేపల్లి లో పుట్టిన ఈటీజీ వంటి సర్వే సంస్థలు తప్ప… క్రెడిబుల్ గా ప్రజాభిప్రాయాన్ని సేకరించే సర్వే సంస్థలన్నీ వైసీపీ ఓటమిని నిఖార్సుగా చెబుతున్నాయి.
మూడు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూసిన తరవాత ఎవరికి అయినా.. వైసీపీ గెలుస్తుందన్న నమ్మకంలేదు. ఎందుకంటే ప్రజాతీర్పు ఏకపక్షంగా ఉంది. రాబోతోంది కూడా. జగన్ మోహన్ రెడ్డి చేసిన పరిపాలన అలాగే ఉంది. ఏ ఒక్క వర్గాన్ని ఆయన వదిలి పెట్టలేదు. చివరికి తన ఓటు బ్యాంక్ అయిన వారిని కూడా… మద్యం పేరుతో దోచుకోవడమే కాదు.. వారి ఆరోగ్యాల్ని రిస్క్ లో పెట్టారు. ఎవరు చెప్పినా చెప్పకపోయినా జగన్ రెడ్డి ఘోరమైన ఓటమి ఖాయం. దానికి వైసీపీ నేతలు మానసికంగా సిద్ధం కావాలి కానీ.. నిజం చెప్పిన ప్రతి ఒక్కరి మీద ఎదురుదాడి చేస్తే.. ప్రయోజనం ఉండదు.
ఓ పీకే పాతాళంలోకి తొక్కేస్తానని చాలెంజ్ చేశారు.. మరో పీకే .. అది జరగబోతోందని విశ్లేషించారు. ఈ పరిస్థితి వైసీపీ నేతలకు నిద్రపట్టనీయకుండా చేస్తోంది.