టీడీపీ ఆఫీసు మీద దాడి చేస్తారు ?. టీడీపీ వాళ్లే దాడి చేశారంటారు. టీడీపీ సభలో అలజడి చేస్తారు.. టీడీపీ వాళ్లే చేశారంటారు.. . ఇది వైసీపీ స్ట్రాటజీ. వివేకా హత్యకేసులోనూ అదే. వివేకానందరెడ్డి ఘోరంగా నరికి చంపి ఆయన కూతురు, అల్లుడే చంపించేశారని.. ప్రచారం చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లుగా పేపర్లలో రాయిస్తున్నాయి. అసలు కేసు నిలబడి.. న్యాయం కోసం పోరాడుతోంది.. సునీత అయితే ఆమెపై నిందలేస్తూ… దాన్ని రాజకీయం చేస్తూ.. . తాము ఏం చెప్పినా నమ్మే గొర్రెలుంటారని కథలు స్టార్ట్ చేశారు.
వివేకా హత్య కేసు నాలుగైదు రోజుల విచారణలో తేలిపోయే కేసు. వివేకా హత్య కేసులో ఎన్నో క్లూలు ఉన్నాయి. క్రైమ్ లెక్కల్లో సాక్ష్యాలు తుడిచేయడానికి ప్రయత్నించిన వారే.. మొదటి అనుమానితులు. హత్యను దాచి పెట్టడానికి ప్రయత్నించిన వారికి మొత్తం తెలిసే ఉంటుంది. మొదట గుండెటపోటు అని నమ్మంచడానికి తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియా.. గుండెపోటుతో మరణించారని.. ఉదయం పది గంటల సమయంలో ప్రకటించింది. విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చి గుండెపోటుతో చనిపోయిన వివేకానందరెడ్డికి సంతాపం ప్రకటించారు. అయితే.. అసలేం జరిగిందో.. కనీసం ఒక్క ఫోటో కూడా బయటకు రానివ్వలేదు. కానీ ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత వైఎస్ వివేకా.. అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారని.. చూస్తే అర్థమైపోతుంది.
డెడ్‌బాడీ పోస్టుమార్టానికి వెళ్లే వరకూ… ఎవరూ… ఆయనది హత్య అని అంగీకరించడానికి సిద్ధపడలేదు. ఈ లోపే సాక్ష్యాలు తుడిచేయడం… వివేకా గాయాలు కనిపించకుండా కట్లు కట్టడం లాంటివి చాలా చేశారు. హత్యను దాచి పెట్టి… సాక్ష్యాలను తారుమారు చేసి… స్మూత్‌గా… అంత్యక్రియలు జరిపించేయాలని… ప్రయత్నించారనేది బహిరంగరహస్యం. గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేసిన వాళ్లే మొదట… ఆయన కుమార్తెకు సమాచారం ఇవ్వలేదు. చివరికి కేసు లేకుండా చేయాలనుకున్నారు. సునీత పట్టుబట్టడంతోనే కేసు నమోదు చేశారు.
చివరికి అత్యంత దారుణంగా నరికేసినట్లుగా తేలడంతో.. ఇక హత్య అని ఒప్పుకోక తప్పలేదు. ఇంత స్పష్టంగా సీక్వెన్స్ ఉన్నప్పటికీ..సీబీఐ అధికారులు.. కేసును చేధించలేకపోయారు. ఫోన్ కాల్ లిస్టుల ప్రకారం బయట ప్రపంచానికి ఆరింటికి హత్య గురించి తెలిసింది కానీ.. మూడున్నర నుంచే అసలు స్కెచ్ అమల్లో ఉందని తేలింది. ఎందుకు సీబీఐ గుట్టు విప్పలేదు ?. ఎందుకు ఇప్పుడు అతకని కథల్ని ప్రచారం చేస్తున్నారు ?. సీబీఐ ఎందుకు తమ వారిపై కేసులు పెట్టినా… కేసును సాల్వ్ చేయలేనంత దీనస్థితికి చేరింది .