విశాఖలో కడతానంటూ కొన్ని ఐకానిక్ భవనాల గ్రాఫిక్స్ ను జగన్ విశాఖలో ప్రదర్శించారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిని చాలా మంది వైసీపీ కార్యకర్తలు నమ్మలేదు. జగన్ వీటిని ప్రకటించలేదని.. టీడీపీ కార్యకర్తలే ఫేక్ చేసి వైరల్ చేస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అలాంటి వారు తక్కువేమీ లేరు. ఎందుకంటే.. అలాంటి గ్రాఫిక్స్ ను విమర్శించి జగన్ గత ఎన్నికల్లో విజయం సాధించారు. ఇప్పుడు ఎన్నికలకు వెళ్లే ముందు అవే గ్రాఫిక్స్ తాను కూడా రిలీజ్ చేస్తే ప్రజలు ఎలా నమ్ముతారు ?. సొంత కార్యకర్తలు కూడా నమ్మలేకపోతే. నిజానికి జగన్ స్టైల్ .. నమ్మేవాళ్లని గొర్రెల్ని చేయడమే.
నన్ను నమ్మడం తప్ప మీకు మరో ఆప్షన్ లేదన్నట్లుగా జగన్ మోహన్ రెడ్డి వ్యవహారశైలి ఉంటుంది. ఎందుకంటే..మీరు ఎదుటివారిని ఇష్టపడరు కాబట్టి.. ఆయనపై వ్యతిరేకంతో అయినా నేను చెప్పేది నిజమని నిమ్మి.. గుడ్డిగా బతికేయాలన్న ఓ సిద్దాంతాన్ని అమలు చేస్తున్నారు. ఒక్క అమరావతి విషయంలోనే కాదు.. వైఎస్ వివేకా హత్య కేసు దగ్గర నుంచి అప్పుల వరకూ ఇదే. కళ్ల ముందు కనిపించే నిజాలను కూడా అబ్బే ఉత్తదే అని… ఎదుటి వారి మీద నిందలు వేస్తే పుంఖానుపుంఖాలుగా రాస్తూంటారు. అవి చదివే వారికి.. తెలుసుకునే వారిగే వెగటు పుట్టిస్తాయి.. మరి రాసే వాళ్లకి ఎలా ఉంటుందో కానీ.. సాక్షి జర్నలిస్టులు అంటే.. అలాగే ఉంటారేమో అనుకోవాల్సిన పరిస్థితి. అందర్నీ గొర్రెల్ని చేయడంలో వారి పద్దతిఓ స్టైల్.
తమను నమ్మేవారు ఏం చెప్పినా నమ్ముతారన్న ఓ బలమైన నమ్మకం వైసీపీ పెద్దల్లో ఉంది. సోషల్ మీడియా యుగంలో .. నిజం ఇట్టే తెలిసిపోతుందన్న వెరపు లేదు. ఎందుకంటే ఆ సోషల్ మీడియాలోనే అంత కంటే వేగంగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి.. అదే నిజమని నమ్మించగలిగే నెట్ వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. వైసీపీని గుడ్డిగా నమ్మితే.. వారు చెప్పే విషయాలు మాత్రమే తెలుసుకుని బావిలో కప్పలా బతకమని తేల్చేస్తారు. వారికి బానిసలుగా పడి ఉండేలా చేసుకుంటారు. కుల వ్యతిరేకతతో కొంత మంది వైసీపీకి అలాగే గొర్రెల్లాగా మారిపోయారు. అలాంటి వారు సోషల్ మీడియాలో వందల మంది కనిపిస్తూ ఉంటారు.