ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఆ వ్యవస్థను పెట్టి ఓటర్లను ప్రజలను బెదిరిస్తున్నారని.. ప్రజాధనంతో పార్టీ పనులు చేయించుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే విపక్షాలన్నీ వాలంటీర్ల వ్యవస్థపై ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఆసరగా చేసుకుని వైసీపీ నేతలు.. టీడీపీ వస్తే వాలంటీర్ వ్యవస్థను తీసేస్తారని ప్రచారం చేస్తున్నారు. దీనికి కౌంటర్ గా టీడీపీ అధినేత.. తాము వాలంటీర్ వ్యవస్థను తీసేయబోమని ప్రకటించారు. ఇంకా వారికి మెరుగైన అవకాశాలు కలిపిస్తామని.. కానీ వైసీపీకి మాత్రం ఊడిగం చేయవద్దని అంటున్నారు.
వాలంటీర్లు అందరూ అధికార పార్టీకి ఓ ప్రైవేటు సైన్యంలా పనిచేస్తున్నారు. ఆంధ్రాలోని మహిళలు కనిపించకుండా పోవడంలో వాలంటీర్ల హస్తం ఉందన్న జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. వాలంటీర్లతోనే ఎన్నికలు గెలవాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. వాలంటీర్లు అందరికీ ఐదు వేలు పార్టీ తరపున ఇస్తున్నారు. బట్టలు పెడుతున్నారు. టీడీపీ వస్తే వాలంటీర్లు ఉండరని అంటున్నారు. ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి వైసీపీని గెలిపించాలంటున్నారు. వాలంటీర్లు కొంత మంది అదే పని చేస్తున్నారు. అయితే చంద్రబాబు వాలంటీర్లకు అభయం ఇచ్చారు. వాలంటీర్ల విషయంలో తమకు సానుభూతి ఉందంటున్నారు. తమ కూటమి అధికారంలోకి వస్తే తొలగిస్తామన్న భయం వాలంటీర్లకు అక్కర్లేదని భరోసా కల్పించారు. అక్రమాలకు పాల్పడని.. వైసీపీకి ఊడిగం చేయని వారికి మంచి భవిష్యత్ ఇస్తామని హామీ ఇచ్చారు.
వాలంటీర్లలోనూ ఏకపక్షంగా ప్రభుత్వానికి అనుకూలత లేదన్న వాదన ఉంది. ఐదేళ్లుగా ఐదు వేల రూపాయలకే పని చేస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు ఇతరత్రా.. తాయిలాలు ఇస్తున్నారు కానీ.. ఎలాంటి ఉద్యోగభద్రత లేదు. ఎలాంటి అవకాశాలు వస్తాయన్న ఆశలు కల్పించడం లేదు. కనీసం ఉద్యోగప్రకటనల్లో రిజర్వేషన్లు అయినా కల్పిస్తారంటే అలాంటి పరిస్థితి కూడా లేదు. భవిష్యత్ లో జీతం పెంచుతారని కూడా లేదు. అందుకే వాలంటీర్లకు తమ భవిష్యత్ బై బెంగ ఉందన్న అభిప్రాయం ఉంది. చంద్రబాబు మంచి భవిష్యత్ కల్పిస్తామన్న హామీతో వారిలో మార్పు వస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.