దెయ్యం సినిమా అంటే హారర్, కామెడీ, థ్రిల్లర్. అంత వరకే తెలుసు. దాంట్లో ఓ లవ్ స్టోరీ కూడా మిక్స్ చేయొచ్చు. కాకపోతే.. దెయ్యంతో లవ్ స్టోరీ అంటేనే కొత్తగా ఉంది. ఇప్పుడు ఆశిష్ అదే చేస్తున్నాడు. ఆశిష్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘లవ్ మీ’. వైష్ణవి చైతన్య కథానాయక. అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నారు. టీజర్ విడుదలైంది. డెవిల్ తో హీరో రొమాన్స్ చేసే కథ ఇది. దెయ్యం ఆడది, పైగా ఒంటరిగా ఉంది.. తను మగ తోడు కోరుకోదా? అనే వెరైటీ క్యారెక్టరైజేషన్ హీరోది. ఇక ఆ తరవాత ఏం జరుగుతుందో తెరపై చూడాలి. 90 సెకన్ల ఈ టీజర్.. థ్రిల్ కలిగించింది. హారర్ సినిమాల్లో ఇదో కొత్త తరహా ఎత్తుగడ అనుకోవొచ్చు. కీరవాణి అందించిన నేపథ్య సంగీతం, పీ.సీ.శ్రీరామ్ ఫొటోగ్రఫీ.. ఈ సినిమాకు అదనపు హంగులు. క్వారిటీ పరంగా ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతోందో చెప్పడానికి కీరవాణి, పీ.సీ.శ్రీరామ్ లాంటి పేర్లు చాలు. ఓ హారర్ సినిమాకు సాంకేతిక హంగులు కుదిరితే.. ఆ ప్రాడెక్ట్ స్థాయి వేరేలా ఉంటుంది. అందుకే ‘లవ్మీ’ పై కూడా ఇప్పటి నుంచే అంచనాలు పెరుగుతున్నాయి. మరి ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.