హైదరాబాద్లోని టానిక్ మద్యం దుకాణాల వ్యవహారం బీఆర్ఎస్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ మద్యం దుకాణాలు పెద్ద ఎత్తున వపన్నులు ఎగ్గొట్టడమే కాదు… ఏ రూల్ పాటించలేదు. ఇష్టారాజ్యంగా అత్యంత ఖరీదైన మద్యాన్ని సులువుగా అమ్ముతూ వచ్చారు. వీరికి ఎలా అనుమతులు వచ్చాయన్నదానిపై ఇప్పుడు అధికారులు ఆరా తీస్తన్నారు. ఎలైట్ లైసెన్స్ ఇవ్వడానికి ఎలాంటి వేలం నిర్వహించలేదు. కనీసం దుకాణాల ఏర్పాటుకు ప్రకటన కూడా ఇవ్వలేదు. కానీ జీవోలు వచ్చాయి. ఇందులో అనేక మినహాయింపులు కూడా వచ్చాయి.
ఈ జీవోను సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్లిన మద్యం దుకాణాల యజమానులపై వేధింపులు కూడా చోటు చేసుకున్నాయి. దీంతో వారు మద్యం వ్యాపారం నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తున్నాయి. తెర ముందు పార్టనర్లుగా ఎవరు కనిపించినా.. తెర వెనుక మాత్రం… కొంత మంది కీలక బీఆర్ఎస్ నేతలు ఉన్నారని .. చాలా మందికి తెలుసు. వారెవరో కూడా స్పష్టత ఉంది. దర్యాప్తు చేస్తున్న వారికీ ఆధారాలు లభించాయని అంటున్నాయి.
కక్ష సాధింపులు అనే భావన రాకుండా అక్రమాలన్నీ వెలుగులోకి తెచ్చి ప్రజల ముందు పెట్టిన తరవాతే చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు. అందుకే.. టానిక్ వ్యవహారంలో జరిగిన దందా అంతా ముందు బయట పెడుతున్నారు. తర్వాత అసలు .. అడ్డగోలు జీవోలు.. ఇతర మోసాల గురించి బయట పెట్టనున్నారు.