సొంత గడ్డపై భారత్‌జట్టుకు తిరుగులేదన్న విషయం మరోసారి నిరూపితమైంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ని మట్టికరిపించింది. 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ని 4-1 తేడాతో కైవసం చేసుకొంది. కేవలం మూడు రోజుల్లోనే ఈ మ్యాచ్ ముగియడం విశేషం.
ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్ లో 219 పరుగులు చేస్తే.. భారత్ 477 పరుగులు చేసి ఈ మ్యాచ్‌పై పట్టు సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 195 పరుగులకే కుప్ప కూలింది. దాంతో ఇన్నింగ్స్ విజయం భారత్ వశమైంది. వందో టెస్ట్ మ్యాచ్ ఆడిన రవిచంద్రన్ అశ్విన్ ఈ టెస్ట్‌లో 9 వికెట్లు పడగొట్టి, భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌కు 4 వికెట్లు దక్కాయి. బుమ్రా, కులదీప్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. జడేజాకు ఒక వికెట్ దక్కింది. ఇంగ్లండ్ బ్యాటర్స్‌లో జోయ్ రూట్ 84 పరుగులు చేశాడు. జైస్వాల్‌కు మ్యాన్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కింది.