వైసీపీ అధినాయకత్వం.. ఐ ప్యాక్ ను నమ్ముకుని చేసే రాజకీయాలు విచిత్రంగా ఉంటున్నాయి. గత ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గం పేరుతో చేసిన తప్పుడు ప్రచారాలు… మీడియాలోనే కాదు.. క్షేత్ర స్థాయిలో చేశారు. వందల గ్రూపుల్ని ఏర్పాటు చేసుకుని టీ కొట్ల దగ్గర.. రచ్చబండ దగ్గర.. చర్చలు పెట్టి .. తమపై సానుకూలత కాకుండా.. ఓ కులంపై వ్యతిరేకత పెంచి… ఫలితాలు రాబట్టారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అధికారంలో ఉన్నారు… ఓ కులం మీద విషం చిమ్మే పరిస్థితి లేకుండా పోయింది. అలా చేసినా ప్రజలు ఆలోచించే పరిస్థితుల్లో లేరు. అందుకే ఇప్పుడు కొత్త నెరెటివ్ తో టీ కొట్ల దగ్గర, రచ్చబండల దగ్గర ముచ్చట్లు పెడుతున్నారు.
పరిస్థితి బాగోలేదని తెలిసి కూడా.. ఎలాగైనా జగనే గెలుస్తాడన్న ఓ ప్రచారాన్ని ప్రచారాన్ని ఐ ప్యాక్ ప్రారంభించింది. ఎలా అయినా అంటే.. ఇక్కడ విస్తృత అర్థాలు ఉన్నాయి. ఒకటి దొంగ ఓట్లు.. రెండు అరాచకాలు… ఈ రెండు చేసినా అయినా జగన్ గెలుస్తారన్న ఓ భయాన్ని ప్రజల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అది జనాల్ని కించపర్చడమే. తాము ఓట్లేయకుండా జగన్ గెలుస్తారన్న నేరెటివ్ నే అత్యంత ఘోరమైనది. దాన్ని ప్రజల్లో పెట్టి… లాభపడాలనుకునే వ్యూహం అమలు చేయడంపై వైసీపీలో విస్మయం వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఓట్లేస్తేనే ఎవరైనా గెలుస్తారు. వారు ఓట్లేయకపోయినా గెలుస్తామన్న భావన ప్రజల్లోకి తీసుకెళ్తే.. వారెందుకు ఊరుకుంటారన్న ప్రశ్న సహజంగానే వస్తుంది.
జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రారని.. రాకూడదనే భావన అరవై శాతం మంది ప్రజల్లో ఉంది.ప్రజా జీవితాలను మెరుగుపర్చకపోయినా పర్వాలేదు కానీ.. నాశనం చేయకూడదు. కానీ జగన్ అదే చేశాడు. అందుకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. దీన్ని తగ్గించుకోవాల్సింది పోయి… ఎలాగైనా జగనే గెలుస్తాడంటూ… ప్రజల్ని రెచ్చగొట్టే స్ట్రాటజీలు అమలు చేస్తే… మరింతగా కిందకు వెళ్లిపోవడం ఖాయం.