నేడో రేపో ఎన్నికల షెడ్యూల్ రావాల్సిన సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శనివారంనాడు ఆయన తన పదవికి రాజీనామా చేశారు. గోయెల్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే ఆమోదించారు. అయితే గో యెల్ తన రాజీనామాకు కారణాలు ప్రకటించ లేదు.
గోయెల్ పదవీ కాలం 2027 వరకు ఉంది. త్వరలో ప్రధాన ఎన్నికల కమి,నర్ రిటైర్ అవుతారు. తర్వతా ఆయనే సీఈసీ అవుతారు. అయినప్పటికీ రాజీనామా చేశారు. మధ్యలోనే వైదొలిగిన తీరు దే శంలో ఇప్పుడు చర్చనీయాంశమైంది. గోయెల్ రాజీనామాతో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సం ఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. ఇప్పటికే ఒక కమిషనర్ పదవి ఖాళీగా ఉంది. ప్రభుత్వం ఆయనను వారించినప్పటికీ ఆయన రాజీనామాకే మొగ్గు చూపారన్న చర్చ జరుగుతోంది.
గోయెల్ బీజేపీకి, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు నమ్మకస్తుడే. గోయెల్ 1985 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి. నవంబర్ 18, 2022లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆ తెల్లవారే ఆయనను ఎన్నిల కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. అయితే ఆయన నియామకాన్ని వ్యతిరేకిస్తూ కొందరు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అయితే పిటిషన్‌ను ద్విసభ్య ధర్మాసనం తిరస్కరించింది. గోయెల్ నియామకాన్ని సమర్థిస్తూ గత ఏడాది తీర్పు వెలువరించింది.