ఆఖరి సిద్ధం సభలో అల్లాండిచేస్తానంటూ మూడు సార్లు వాయిదా వేసి… నిర్వహించిన ఆఖరి అద్దంకి సిద్ధం సభలోనూ పాత రాగమే పాడారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబుతో పాటు పవన్ మీద ఏడవడం తప్ప.. కొత్తగా చెప్పిందేమీ లేదు. పొత్తులో చేరిన బీజేపీని గట్టిగా విమర్శించడానికి కూడా భయపడ్డారు. కానీ చంద్రబాబు, పవన్ లను మాత్రం గతంలలోగా… తిట్లందుకున్నారు. ఎప్పుడూ చెప్పేవే కానీ కొత్తగా.. మళ్లీ గెలిస్తే ఏం చేస్తాననే మాట తన నోటి వెంట రానీయలేదు.
మేనిఫెస్టో ప్రకటిస్తామని.. అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటిస్తామని గతంలో చెప్పారు. కానీ ఆఖరి రాగం పాడేసినప్పటికీ.. ఇంకా అభ్యర్థుల జాబితా రెడీ కాలేదు. మేనిపెస్టో రెడీ లేదు. ఇప్పటికే పథకాలకు డబ్బులు అకౌంట్లలో జమ కావడం లేదు. కొత్తగా పథకాలు ప్రకటిస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నమ్మించడానికి ఏదో ఓ సర్కస్ ఫీట్ చేయడానికి ఢిల్లీ వెళ్లి మోడీని కలవాలనుకున్నారు. ఆ అవసరం లేకుండా.. ఎన్డీఏలో టీడీపీ చేరిపోయింది. ఇప్పుడు జగన్ రెడ్డి.. మామూలుగా రొటీన్ డైలాగుల్ని చెప్పుకుంటూ ప్రసంగాలు చేస్తున్నారు. అభ్యర్థులతో బంతాట ఆడుంటున్నారు. ఎవరికి టిక్కెట్లు ఉన్నాయో ఎవరికీ తెలియదు. ఇలాంటి గందరగోళ పరిస్థితి ముందు అభ్యర్థుల్ని ప్రకటిస్తే పార్టీ చిందరవందర అయిపోతుందని ఆగిపోయారు.
జనాలు పెద్దగా రారని ముందుగానే అర్థం కావడంతో… గ్రాఫిక్స్ ఏర్పాట్లు చేసుకున్నారు. ఇతర మీడియా కెమెరాలు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే టీడీపీకి చెందిన కొంత మంది సభ ప్రారంభమయ్యే సరికి డ్రోన్లతో దృశ్యాలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో బండారం బయటపడింది. లాంగ్ షాట్ తీయకుండా… తలలు మాత్రమే కనిపించేలా దృశ్యాలు తీసి.. వైసీపీ వాళ్లు మీడియాకు ఇచ్చి.. లక్షలు వచ్చారని ప్రచారం చేసుకుంటున్నారు. కానీ చాలా వరకూ బస్సులు కూడా ఖాళీగా వచ్చాయి.
మొత్తంగా నాలుగు సిద్ధం సభలకు వందల కోట్లు ఖర్చు పెట్టారుకానీ.. దాని వల్ల వచ్చిన మైలేజీ ఎంత అనేది.. వైసీపీ వారికి అర్థం కాలేదు. ప్రతీ సభలోనూ చంద్రబాబు, పవన్ ను తిట్టడమే ఎజెండా. వచ్చే ఎన్నికలపై కనీస ప్రణాళికను కూడా తమ పార్టీ కార్యకర్తల ముందు ఆవిష్కరించలేకపోయారు.