తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తున్నదని వైసీపీ ఫిరాయింపుల మొదలైన నాటినుంచి ఆరోపిస్తూనే ఉంది. అక్రమంగా సంపాదించిన కొన్ని వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి అయినా సరే వైసీపీ ని దెబ్బ తీయడానికి కుట్రలు చేస్తున్నాడని జగన్ అండ్ కో అంటూనే ఉన్నారు. ఒక్కొక్కరు పది ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు, ఎలాంటి ఆర్ధిక ప్రయోజనం లేకుండా టీడీపీ లోకి ఎందుకు వెళతారు…? అని లాజికల్ గా ఆలోచించగలిగిన కొందరు, మరియు, జగన్ మీద అభిమానం ఉన్న వాళ్ళు ఈ ఆరోపణలను నమ్ముతారు కూడా. అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన పుకారు తాజాగా హల్చల్ చేస్తున్నది. అదేమిటంటే కేవలం ఒక ఎమ్మెల్యేను తమ పార్టీ లోకి ఆకర్షించడానికి టీడీపీ వారు 150 కోట్ల రూపాయలు ఆఫర్ చేసారన్నది.
ఇందులో నిజానిజాలు సంగతి ఎవరికీ తెలియదు గానీ, మొత్తాన్ని గుంటూరు జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేకు ఈ మేరకు 150 కోట్ల సాలిడ్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తున్నది. కేవలం ఒక ఎమ్మెల్యే కోసం అంత భారీ ఆఫర్ ఇస్తారా ? టీడీపీ ఏమి సంఖ్యాబలం కొరత లో లేదు కదా అని ఎవరికైనా అనుమానం కలగవచ్చు. అయితే ఈ ఎమ్మెల్యేకు మాత్రం ఇంత భారీ ఆఫర్ రావడానికి ఒక కారణం ఉంది. ఆయన గుంటూరు జిల్లాకు చెందినా ఎమ్మెల్యే, ఆర్థికంగా బాగా సంపన్నుడని కూడా పేరు ఉంది. సాక్షి చేసిన కథానాల్లో కీలకమైన చాలా సమాచారాన్ని అయన పోగేసి తెచ్చి ఇచ్చారని అనుకుంటున్నారు. ఆయన తన సొంత డబ్బు ఖర్చు పెట్టి, డాక్యుమెంట్లు సకలం సంపాదించారని వాటిని దగ్గరుంచుకుని సాక్షి చెలరేగిపోతున్నదని అంటున్నారు. అయితే ఈ భూదందా లు బయటకు రావడంలో కీలకంగా ఉన్న ఆ ఎమ్మెల్యే ను కొనేయడానికి టీడీపీ ప్రయత్నించినట్లు సమాచారం. 150 కోట్ల ఆఫర్స్ తో అయన మామ ద్వారా ప్రతిపాదన పంపినట్లు పుకారు.
అయితే ఈ ఎపిసోడ్ లో సెకండ్ పార్ట్ ఏమిటంటే టీడీపీ ఆఫర్ గురించి జగన్ కు చెప్పదానికి సదరు ఎమ్మెల్యే లోటస్ పాండ్ కు వచ్చారుట. టీడీపీ వాళ్ళు ఇంత ఇస్తామన్నారు అని అంటే జగన్ కూడా ఒక ఆఫర్ చెబుతాడాని అయన ఆశించారో ఏమో తెలియదు గానీ, వచ్చి చెప్పారుట. అయితే జగన్ చాలా వెరైటీ గా “డబ్బు వస్తోంటే వద్దనడం ఎందుకు.. తీసుకుని పార్టీ మారిపో అన్నా నువ్వు మన వాడివి ఎక్కడ వుంటే ఏముంది !” అని అన్నాడుట. దీనితో ఖంగు తిన్న సదరు ఎమ్మెల్యే ” లేదు లేదు పార్టీ మరే ఉద్దేశం నాకు లేదు.. ఊరకే మీకు సమాచారం చెబుదామని వచ్చా” అని వెళ్ళిపోయాడుట. అదీ సంగతి.