తెలుగు చిత్రసీమలో విషాదం చోటు చేసుకొంది. దర్శకుడు సూర్యకిరణ్ అనారోగ్య కారణాల వల్ల కన్నుమూశారు. ఆయన వయసు 51 సంవత్సరాలు. ‘సత్యం’ చిత్రంతో సూపర్ హిట్టు కొట్టారు సూర్య కిరణ్. ఆ తరవాత ‘ధన 51’, ‘రాజుభాయ్’, ‘చాప్టర్ 6’ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. కొంతకాలంగా పచ్చకామెర్ల తో బాధ పడుతూ, చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటూ ఈరోజు తుది శ్వాస విడిచారు. దర్శకుడిగా ఫామ్‌లో ఉన్నప్పుడే హీరోయిన్ కల్యాణికి పెళ్లి చేసుకొన్నారు. ఆ తరవాత కొంతకాలానికి విడిపోయారు. నటి సుజితకు స్వయానా సోదరుడు కూడా. బాల నటుడగిగా రంగ ప్రవేశం చేసి దాదాపు 200 చిత్రాల్లో నటించారు. కొన్ని సినిమాలకు రచయితగా పని చేసి, ఆ తరవాత దర్శకత్వం వైపు అడుగులేశారు. బిగ్ బాస్ సీజన్ 6లో మెరిశారు. సూర్య కిరణ్ మరణ వార్త విని టాలీవుడ్ షాక్‌కి గురవుతోంది. ఆయన అనారోగ్యం విషయం కూడా ఎవ్వరికీ తెలీదు. సూర్యకిరణ్‌కి సన్నిహితులు ఎవరూ లేకపోవడడంతో ఆయన ఆరోగ్య విషయాలు బయటకు రాలేదు.