టాలీవుడ్లో త్వరలోనే పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం పెళ్లి చేసుకొంటున్నారు. కథానాయిక రహస్యతో ఆయన కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకొంటున్నారు. ‘రాజావారు రాణీగారు’ సినిమాలో కథానాయికగా నటించింది రహస్య. ఆ సినిమాతోనే కిరణ్ అబ్బవరం పరిచయం అయ్యాడు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇప్పుడు పెళ్లికి దారి తీసింది. ఈవారంలో నిశ్చితార్థం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి రెండు కుంటుబాల పెద్దలు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరు అవుతారని టాక్. ఈ వేసవిలో పెళ్లికి ముహూర్తం నిర్ణయించారని తెలుస్తోంది. ఇంతకాలం ప్రేమ వ్యవహారం సాగుతున్నా కిరణ్ మాత్రం ఈ విషయంలో గుట్టు పాటించాడు. చివరికి.. ఇప్పుడు పెళ్లితో తమ బంధాన్ని మరింత బలపరచుకొంటున్నాడు. ‘ఎస్.ఆర్.కల్యాణమండపం’తో హిట్టు కొట్టి, కెరీర్ని ఘనంగా ప్రారంభించిన కిరణ్.. ఇప్పుడు ‘దిల్ రూబా’ సినిమాతో బిజీగా ఉన్నాడు.