రాజకీయం బ్రహ్మరాక్షసి అందులో సందేహంలేదు. ఏపీలో అయితే రాజకీయం మనుషుల్ని పీక్కు తినే బ్రహ్మరాక్షసి. గీతాంజలి అనే యువతి విషయంలో అదే జరుగుతోంది. ఆమె మృతదేహం చుట్టూ చేస్తున్న రాజకీయం , నిజాలు వెలికి తీయకుండా చేస్తున్న తప్పుడు ప్రచారం చూస్తూంటే ఎవరికైనా బాబోయ్ ఇదేం బ్రహ్మరాక్షసి రాజకీయం అనిపించక మానదు. ఎందుకంటే.. గీతాంజలి మృతి వెనుక చాలా మిస్టరీ ఉంది. దాన్ని దాచేసి.. సోషల్ మీడియా పేరుతో రాజకీయం చేస్తున్నారు.
ప్రమాదం జరిగిన తర్వాతనే గీతాంజలి వీడియోలు వైరల్!
గీతాంజలి. ప్రమాదం జరిగిన వెంటనే చనిపోయారు. ఐదు రోజుల పాటు ప్రభుత్వ ఆస్పత్రిలో చావు బతుకులతో పోరాడారు. ఈ మధ్య కాలంలో ఆమె ప్రమాదానికి గురైందని కానీ.. చావు బతుకుల్లో ఉన్నారని కానీ ఎవరికీ తెలియదు. ఆమెతో వీడియోలు చేయించుకుంటున్న వైసీపీ సోషల్ మీడియా టీం సజ్జల భార్గవకు తప్ప.
మార్చి ఆరో తేదీన తొలి సారి గీతాంజలి వీడియో పోస్ట్ చేసిన వైసీపీ సోషల్ మీడియా టీం, సజ్జల భార్గవ
గీతాంజలి ప్రభుత్వ పథకాలను పొగుడుతున్న వీడియోను మొదటి సాగా వైసీపీ సోషల్ మీడియా వింగ్ మార్చి ఆరో తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో పోస్ట్ చేసింది. ఆ వీడియోలు సోషల్ మీడియా టీం డిలీట్ చేసినా.. స్క్రీన్ షాట్లు రెడీగా సాక్ష్యంగా ఉన్నాయి. ఆమె జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పొడిగిన వైనాన్ని బాగా ప్రజెంట్ చేసుకున్నారు.
మార్చి 7 వ తేదీన ప్రమాదానికి గురైన గీతాంజలి
మార్చి ఏడో తేదీన ఉదయం 11 గంటల సమయంలో గీతాంజలి తెనాలి రైల్వే స్టేషన్లో ప్రమాదానికి గురైంది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేర్చారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మార్చి 11వ తేదీన గీతాంజలి చనిపోయింది . ప్రమాదానికి గురైన సమయంతో సహా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
మార్చి 7వ తేదీ సాయంత్రం నుంచి ప్రతిపక్ష సోషల్ మీడియా కార్యకర్తల ప్రశ్నలు
గీతాంజలి చావు బతుకుల్లో ఉన్న విషయం ఎవరికీ తెలియదు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వైరల్ చేసిన వీడియోలో ఉన్న మహిళ ఎవరో కూడా తెలియదు. కానీ ఆ మహిళ చెబుతున్న అంశాలపై ప్రతిపక్ష పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు మార్చి 7వ తేదీన సాయంత్రం నుంచి ప్రశ్నించడం ప్రారంభించారు. ఇల్లు రాకుండానే అద్దె వస్తుందని..ఐదేళ్లు అమ్మఒడి ఇచ్చారని చెప్పారు. కానీ ఆమె పిల్లలు బడికెళ్లే వయసు లేని వాళ్లే అంటే రైలు ప్రమాదం జరిగిన తర్వాత.. ఆస్పత్రిలో చేరిన తర్వాతనే ఆమె వీడియోల్లోని అంశాలపై ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు ప్రశ్నించడం ప్రారంభించారు. ఇది పదో తేదీ వరకూ జరిగింది. అంటే ఆమె ప్రమాదంలో ఉందని.. ఎవరికీ తెలియదు.
గీతాంజలి ప్రమాదం గురించి వైసీపీ సోషల్ మీడియాకే తెలుసు.
దీన్ని బట్టి చూస్తే.. గీతాంజలి ప్రమాదం లేదా ఆత్మహత్య అనేది సోషల్ మీడియా పోస్టుల వల్ల కాదని స్పష్టమవుతుంది. చాలా క్లియర్ గా.. గీతాంజలి ప్రమాదానికి గురైన తర్వాతనే వీడియోలు వైరల్ అయ్యాయి. ఆమెకు ప్రమాదం జరిగినట్లుగా వైసీపీ సోషల్ మీడియాకు తప్ప ఎవరికీ తెలియదు. చనిపోయిన తర్వాత.. ట్రోలింగ్ వల్ల చనిపోయిందంటూ వారే ప్రచారం చేశారు. ఈ డీటైల్స్ అన్ని ఎలా తెలిశాయో మిస్టరీగానే ఉంది.
పోలీసులు సమగ్ర విచారణ చేయగలరా ?
దీనిపై సమగ్ర విచారణ జరపాలని.. ప్రమాదం జరిగిన పరిస్థితులపై పరిశోధన జరిపి ప్రమాదమా లేదా ఆత్మహత్య అనేది తేల్చాలనేది ప్రజలు చేస్తున్న డిమాండ్. ఇందులో ఏ రాజకీయ పార్టీ అయినా ప్రయోజనం పొందేందుకు కుట్ర చేసి ఉంటే.. బయట పెట్టాల్సి ఉంది. తెనాలి రైల్వే స్టేషన్లో గీతాంజలి ఉన్న సీసీ టీవీ ఫుటేజీని వెంటనే విడుదల చేయాలి. ఈ అంశంపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు సోషల్ మీడియా మీద నెపంపెట్టి అసలు విషయాన్ని పక్క దోవ పట్టించి.. రూ. 20 లక్షలు సాయం కింద ప్రకటించి.. స్క్రిప్టెట్ స్టేట్మెంట్లు ఇప్పించడం కన్నా.. ఓ మహిళ కుటుంబానికి నిజాలేమిటో వెల్లడి చేసి న్యాయం చేయాలి..