బీఆర్ఎస్ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. లోక్ సభ ఎన్నికలకు ముందే… గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు తప్ప అందరూ కాంగ్రెస్ లో చేరిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న ప్రచారం ఊపందుకుంటోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి దానం నాగేందర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వ్యవహారం సంచలనంగా మారింది.
భట్టి విక్రమార్క్ మంగళవారం ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రోటోకాల్ ప్రాకరం.. ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కూడా ఆహ్వానం అందింది. ఆయన కూడా వెళ్లారు. అక్కడ రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. రేవంత్ సీఎం అయ్యాక.. ఆర్టీసీ ఉద్యోగుకు ప్రతీ రోజూ పండగలాగే ఉందన్నారు. ఆయన మాటలు విన్న తర్వాత చాలా మందికి క్లారిటీ వచ్చింది.
బీఆర్ఎస్ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. ఈ క్రమంలో అధికారం లేకపోతే… హైదరాబాద్ లో చిన్న పని కూడా చేయించలేమని దానంకు తెలుసు. అందుకే ఆయన కూడా సర్దుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. దానం బీఆర్ఎస్ లో పుట్టి పెరగలేదు. ఆయన ఉద్యమకారులను వెంటపడిన రోజులు ఉన్నాయి. కాంగ్రస్, టీడీపీ, కాంగ్రెస్,…బీఆర్ఎస్ అంటూ ఆయన పయనం సాగుతోంది. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చే చాన్సులు కనిపిస్తున్నాయి.