జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానంపై సస్పెన్స్ వీడింది. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు పవన్ స్వయంగా వెల్లడించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ దినోత్సవ సభలో ఈమేరకు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా పవన్ ఎంపీగా పోటీ చేస్తారనే కథనాలపై కూడా స్పష్టత ఇచ్చారు. తనకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని, ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని క్లారిటీ ఇచ్చారు. ఇదే సభలో ఆయన మాట్లాడుతూ.. అధికారం కోసం కాదు.. మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. జగన్పై నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు. కానీ, మమ్మల్ని తొక్కేస్తామంటే.. మేము తొక్కేస్తామని హెచ్చరించారు. తనపై దాడికి పాల్పడితే ఏం జరుగుతుందో వారి ఊహకే వదిలేస్తున్నామని, ప్రజలు తిరగబడితే ఎవరూ తట్టుకోలేరు’’అన్నారు