ఇక రెండో స్థానంలో మెగా ఉంది. హైదరాబాద్ కు చెందిన ఈ కంపెనీ బీఆర్ఎస్ కు మహారాజపోషకురాలు. అంతే కాదు గత ఐదేళ్ల కాలంలో వైసీపీకి పెద్ద మొత్తంలో ముట్టచెప్పింది. ఏమైనా అనుకుంటారేమోనని బీజేపీకి ఇచ్చింది. చివరికి యశోదా ఆస్పత్రి కూడా బీజేపీకి విరాళాలు ఇచ్చిన వారిలో ఉన్నారు. చాలా కంపెనీలపై .. ఐటీ దాడులు జరిగిన తర్వాతనే విరాళాలు ఇచ్చారన్న విశ్లేషణలు సోషళ్ మీడియాలో వస్తున్నాయి. అయితే ఎలక్టోరల్ బాండ్స్ ఎవరెవరు కొన్నారో వివరాలు ఉన్నాయి కానీ.. వారంతా ఫలానా పార్టీకే ఇచ్చారన్న వివరాలు మాత్రం స్పష్టత లేదు. సగానికిపైగా బీజేపీకి వెళ్లాయన్న అంశంపై మాత్రం స్పష్టత ఉంది.
రాజకీయ పార్టీలకు విరాళాలు ఒక్క ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా మాత్రమే కాకుండా… ప్రుడెంట్ అనే సంస్థ కూడా ఫండ్ ద్వారా ఇస్తోంది. ఈ సంస్థ బీజేపీ కోసమే ఏర్పడినట్లుగా 90 శాతం ఆ పార్టీకే ఇస్తుంది. విచిత్రం ఏమిటంటే… టాప్ డోనర్స్ జాబితాలో రిలయన్స్ కానీ అదానీ కానీ లేదు. వీరు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పెద్దగా రాజకీయ పార్టీలకు విరాళాలు ప్రకటించలేదు. నేరుగా ఖాతాల్లో చూపించేలాగా ఇచ్చి ఉంటారని భావించవచ్చు.
మొత్తంగా ఎలక్టోరల్ బాండ్స్ గురించి వివరాలు బయటకు వచ్చాయి. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చా.. లేదా అన్నది తర్వాత విషయం.. కానీ వారంతా.. పార్లమెంట్ పాస్ చట్టం ప్రకారం విరాళిచ్చారు. తప్పొప్పులు నిర్ణయించి.. తప్పు చేశారని ఎవరు భావిస్తే.. అవినీతి చేశారని భావిస్తే శిక్షించాల్సింది ప్రజలే.